వేస‌విలో ప‌వ‌ర్ క‌ష్ట‌మే.. ఏపీలో తీవ్ర మ‌వుతున్న విద్యుత్ సంక్షోభం

Update: 2022-02-15 23:30 GMT
మ‌రో రెండు వారాల్లో వేస‌వి కాలం ప్రారంభం కానుంది. అయితే.. ఇప్ప‌టి నుంచే విద్యుత్ స‌మ‌స్య‌లు ఏపీని ఆవ‌రిస్తున్నాయి. అన‌ధికార కోత‌లు ప్రారంభ‌మైపోయాయి. దీనికి కార‌ణం..ప్ర‌జ‌ల వినియోగం పెరిగి.. ఉత్ప‌త్తి త‌గ్గిపోవ‌డం వ‌ల్ల‌.. సాధార‌ణ వినియోగం క‌న్నా కూడా ఇప్పుడు త‌క్కువ‌గానే ఉంది.

ఎందుకంటే.. ఇంకా చ‌లి కొన‌సాగుతోంది. దీంతో సాధార‌ణ వినియోగ‌మే ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఉత్ప‌త్తి లేదు. దీంతో అన‌ధికార కోత‌లు.. వేసవికి ముందుగానే చోటు చేసుకున్నాయి. దీంతో గ్రామాల్లో అయితే.. గంట‌ల త‌ర‌బ‌డి కోత‌లు ఉంటున్నాయి.

ఇక‌, న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో అయితే.. నిర్దేశిత కాలానికి కోత‌లు విధిస్తున్నారు. అంతేకాదు... క‌నీసం ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మాచారం లేకుండానే కోత‌లు విధిస్తుండ‌డం గ‌మ‌నార్హం. క‌రెంట్ ఎప్పుడు ఉంటుందో, ఉండ దో కూడా తెలియ‌ని సందిగ్ధత నెల‌కొని ఉంది.

 అయితే, అత్యంత కీల‌క‌మైన  వ్య‌వ‌సాయ, పారిశ్రామిక రంగాల‌కు కూడా కోత‌లు ఆగేలా క‌నిపించ‌డం లేదు.  గ్రామీణ ప్రాంతాల‌లో వ్య‌వ‌సాయ రంగానికి విద్యుత్ స‌ర‌ఫ‌రాలో ఎప్ప‌టిక‌ప్పుడు కోత‌లు వ‌స్తూనే ఉన్నాయి.

లోడ్ రిలీఫ్ పేరిట తీసుకు వ‌చ్చిన నిబంధ‌న‌ల కార‌ణంగా విద్యుత్  స‌ర‌ఫ‌రా  ఎప్ప‌టిక‌ప్పుడు నిలిచిపో తోంది.  స‌ర‌ఫ‌రా క‌న్నావాడ‌కం పెరిగిపోయింది. దీంతో న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాలు.. గ్రామాలు అనేతేడా లేకుం డా కోత‌లు విధిస్తున్నారు.

ఇలా జ‌ర‌గ‌డానికి అనేక కార‌ణాలు ప్ర‌భుత్వం వైపు నుంచే క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా బొగ్గు నిల్వ‌లు లేక‌పోవ‌డం, దీంతో థ‌ర్మ‌ల్ విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాలు అనుకున్న విధంగా ఉత్ప‌త్తి ఇవ్వ‌లేక‌పోతున్నాయి. జెన్కో ప్లాంట్ల‌కు ప్ర‌ధానంగా ఇదే స‌మ‌స్య‌గా ప‌రిణ‌మిస్తోంది.

మ‌రోవైపు ఉత్ప‌త్తి సంస్థ‌ల‌కు బ‌కాయిలు స‌కాలంలో చెల్లించ‌క‌పోవ‌డం  విద్యుత్‌పై ప్ర‌భావం ప‌డుతోంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇటీవ‌ల ఎన్టీపీసీఎల్ కు 300 కోట్లు ఇవ్వాల్సి ఉంటే క‌నీసం 30 కోట్లు స‌ర్దుబాటు చేయ‌మ‌న్నా ప్ర‌భుత్వం చేయ‌లేక‌పోయింది.

అదేవిధంగా జెన్కో, ట్రాన్స్‌కో.. ఉద్యోగుల‌కు జీతాలు కూడా స‌కాలంలో ఇవ్వ‌డం లేదు. ఈ సంస్థ‌లు తీసుకున్న రుణాల‌ను కూడా చెల్లించ‌డంలేదు. దీంతో ఆయా సంస్థ‌లు.. ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నాయి. అంతేకాదు.. క‌రెంటు నిలుపుద‌ల‌కు కూడా రెడీ అవుతున్నా యి. మ‌రి ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News