తెలంగాణ రాష్ట్రంలో లైంగిక నేరస్థుల రిజిస్ట్రర్ను ఏర్పాటు చేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్చేసిన విజ్ఞప్తికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.
తెలంగాణలోని లైంగిక నేరాల్లో నిందితులుగా ఉన్న వారితో అమెరికాలో తరహాలో జాబితా తయారు చేయాలని.. ఆ జాబితా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సామాజిక కార్యకర్త సునీత ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను ఆమె మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. రిక్రూట్ మెంట్ ప్రక్రియలో సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రర్ పనిచేస్తుందిన ఆమె ట్వీట్లో అభిప్రాయపడ్డారు.
నేరస్థుల జాబితానుతయారు చేసేందుకు తన వద్ద ఒక కాన్సెప్ట్ ఉందని.. సుమారు 20 దేశాల్లో నిర్వహించిన పరిశోధనల ఆధారంగా ఆ విధానాన్ని రూపొందించామని.. దాన్ని సమర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు సునీత ట్వీట్ లో తెలిపారు.
దీనికి మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. లైంగిక నేరస్థుల జాబితాను ఖచ్చితంగా తయారు చేద్దామని కేటీఆర్ అన్నారు. దానికి సంబంధించిన కాన్సెప్ట్ ను ప్రభుత్వానికి ప్రజెంట్ చేయాలని.. ఆ కాన్సెప్ట్ ను తాము ఖచ్చితంగా ముందుకు తీసుకెళుతున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
నిజానికి ఈ ఆలోచన అద్భుతంగా కనిపిస్తోంది. సునీత లైంగిక నివారణకు చేసిన ఈప్రతిపాదన అమోఘమైనది. స్వతహాగా లైంగిక వేధింపులకు గురై ప్రాణాలతో బయటపడిన ఆమె బాధితుల కోసం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తోంది.
ఆమె ఆలోచనకు తెలంగాణ ప్రభుత్వం నుండి సహకారం అందుతుందని.. నేరాలలో మునిగిపోయి జీవితాంతం భారీ మూల్యం చెల్లించే నేరస్థులకు పీడకలగా మారే దేశంలోనే మొదటి రాష్ట్రం కావాలని ఆమె ఆశిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆమె కలను నెరవేరుస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.