మహిళలు రెచ్చగొట్టేలా బట్టలేసుకుంటే.. లైంగిక వేధింపుల చట్టం వర్తించదు!
'మగవాళ్లను రెచ్చగొట్లేలా.. అన్ని అవయవాలూ కనిపించేలా బట్టలేసుకుంటే.. లైగింక వేధింపుల నిరోధక చట్టం కింద మహిళలకు ఎలాంటి రక్షణా లభించదు' అని కేరళలోని సెషన్స్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా మహిళ రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకున్నప్పుడు.. భారత శిక్షా స్మృతి సెక్షన్ 354-ఏ (లైంగిక వేధింపుల నిరోధక చట్టం) వర్తించదని పేర్కొంది. సివిక్ చంద్రన్ అనే 74 ఏళ్ల కార్యకర్త ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా నిందితుడి వయసును ప్రస్తావించింది. 'ఒకవేళ బాధితురాలిని భౌతికంగా తాకినా, శారీరక పరిమితులు ఉన్న 74 ఏళ్ల వ్యక్తి ఆమెను ఒడిలో బలవంతంగా కూర్చోబెట్టుకుంటారని అనుకోవడం నమ్మే విధంగా లేద``ని న్యాయమూర్తి పేర్కొన్నారు.
'నిందితుడు సమర్పించిన ఫొటోలు చూస్తే ఫిర్యాదుదారు(ఆమె) రెచ్చగొట్టేవిధంగా ఉన్న దుస్తులను ధరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందువల్ల నిందితుడికి సెక్షన్ 354 ఏ వర్తించదు' అని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ కృష్ణకుమార్ పేర్కొన్నారు. ఫిర్యాదు చేయాలంటే మహిళ గౌరవ, మర్యాదలకు భంగం కలిగిందనేందుకు తగిన ఆధారాలు ఉండాలని చెప్పారు.
ఏం జరిగిందంటే..
2020 ఫిబ్రవరిలో సివిక్ చంద్రన్ కొందరితో కలిసి కొయిలాని ప్రాంతంలోని నంది బీచ్ వద్ద ఓ క్యాంపు ఏర్పాటు చేశాడు. ఈ క్యాంపులో ఫిర్యాదు చేసిన మహిళ సైతం పాల్గొన్నారు. క్యాంపులోని వ్యక్తులందరూ సరదాగా చుట్టూ తిరిగేందుకు వెళ్లగా.. ఫిర్యాదుదారును చంద్రన్ చెయ్యి పట్టుకొని లాగాడు.
అనంతరం, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. రహస్య భాగాలపై చేతులు వేసేందుకు ఒడిలో కూర్చోవాలని కోరాడు. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 354 ఏ(2), 341, 354 ప్రకారం చర్యలు తీసుకోవాలని మహిళ ఫిర్యాదు చేశారు.
అయితే, ఈ కేసులో తనకు బెయిల్ ఇప్పించాలని నిందితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ బెయిల్ అభ్యర్థనను బాధితురాలి తరఫున వాదనలు వినిపిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారు. గతంలోనూ నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని న్యాయస్థానం ముందు ప్రస్తావించారు. నిందితుడిపై మరో లైంగిక వేధింపుల కేసు కొనసాగు తోంది. ఓ దళిత మహిళపై వేధింపులకు యత్నించిన కేసులో అతడికి ఇటీవలే బెయిల్ లభించింది. అయితే... తాజా కేసులోనూ చంద్రన్‌కు బెయిల్ లభించడం గమనార్హం.
Full View