తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ ఎస్ పార్టీని కొత్తగా ఇరకాటంలో పడేసేందుకు సిద్ధమైంది. సీఎం కేసీఆర్ తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ టార్గెట్ చేసుకొని నిన్న శాసనసభలో.. నేడు శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులు చేసిన విమర్శల దాడి మొదలుపెట్టారు. శాసనమండలిలో వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ తాము పెట్టిన భిక్ష అని అన్నారు. దీంతో కోపోద్రిక్తులైన మంత్రి కేటీఆర్ ధీటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఎవరో పెట్టిన భిక్ష కాదన్నారు. ప్రజలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నారని చెప్పారు.
నిన్న శాసనసభలో ఒకాయన.. ఇవాళ మీరు ఇలా మాట్లడం సరికాదని పేర్కొంటూ షబ్బీర్ అలీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అమరవీరుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలు చంపినోళ్లే సంతాప సభలు పెట్టినట్లు ఉందని విమర్శించారు. "1956లో తెలంగాణకు ఆంధ్రాతో బలవంతంగా పెళ్లి చేసింది కాంగ్రెస్ కాదా? 1969లో విద్యార్థులను కాల్చి చంపింది కాంగ్రెస్ కాదా? 2004 నుంచి 2014 దాకా తాత్సారం చేసింది మీరు కాదా? విధి లేని పరిస్థితుల్లోనే తెలంగాణ ఇచ్చారు" అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై అభాండాలు వేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతు చనిపోతే కేవలం రూ. లక్షా 50 వేలు మాత్రమే పరిహారం చెల్లించారని కేటీఆర్ గుర్తు చేశారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం రూ. లక్షా 50 వేల పరిహారాన్ని నాలుగు రెట్లు పెంచిందని తెలిపారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ రైతులకు కనీసం ఎరువులు కూడా సరఫరా చేయలేకపోయిందని కేటీఆర్ విమర్శించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/