రోడ్డు ప్రమాదం లో నయిం మేన కోడలు దుర్మరణం

Update: 2020-01-13 04:23 GMT
జాతీయ రహదారి పై గంటకు 120 కి.మీ. వేగంతో కారును నడపటమే ఒక నేరం. అంత వేగంలో ఉన్న వేళ.. లారీని ఓవర్ టేక్ చేయటానికి మించిన రిస్క్ ఏముంటుంది? కార్ స్టీరింగ్ చేతికి వస్తే చాలు.. చెలరేగిపోయే చాలామందిలానే నయిం సోదరు కుమార్తె సాజీదా షాహీనా వ్యవహరించి ప్రాణాలు కోల్పోయిన ఉదంతం చోటు చేసుకుంది.

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి - అద్దంకి రహదారిలో మిర్యాలగూడ వైపు వెళుతున్న లారీని ఓవర్ చేసే క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బలంగా లారీని ఢీ కొట్టింది. అంతే.. ఆమె కారు పల్టీలు కొట్టుకుంటూ వెళ్లటమే కాదు.. కారులో డ్రైవ్ చేస్తున్న 35 ఏళ్ల సాజీదా షాహీనా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

గ్యాంగ్ స్టర్ నయిం ఎన్ కౌంటర్ లో మరణించిన తర్వాత.. పలు కేసులు సాజీదా మీదా బుక్ అయ్యాయి. భర్తతో కలిసి హయత్ నగర్ కు సమీపంలోని కుంట్లూరులో ఆమె నివసిస్తుంటారు. నల్గొండ సమీపంలో జరిగిన ఒక గృహ ప్రవేశానికి వచ్చిన ఆమె.. మిర్యాలగూడ కు వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరారు. సొంతంగా డ్రైవ్ చేస్తూ గంటకు 120కి.మీ. స్పీడ్ తో కారులో ప్రయాణిస్తుంది. ఈ సమయంలోనే లారీని ఓవర్ టేక్ చేయబోయి.. అంచనా మిష్ అయిన ఆమె లారీని బలంగా ఢీ కొట్టటం తో ప్రాణాలు కోల్పోయారు. కారులో ఇరుక్కు పోయిన ఆమె మృత దేహాన్ని అతి కష్టమ్మీద బయట కు తీశారు. ఆమెకు పోస్టుమార్టం నిర్వహించేందుకు డెడ్ బాడీని తరలించారు. సాజీదాకు ఇద్దరు కమార్తెలు ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదం మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Tags:    

Similar News