భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌: ‌మాన‌వ‌త్వంతో షేక్‌పేట త‌హ‌సీల్దార్‌కు బెయిల్‌

Update: 2020-06-18 13:00 GMT
కోట్ల విలువైన భూమి వ్య‌వ‌హారంలో అవినీతికి పాల్ప‌డి అరెస్ట‌యిన‌ షేక్ పేట తహసీల్దార్ సుజాత ఎట్ట‌కేల‌కు బెయిల్‌పై విడుద‌ల అయ్యారు. అయితే ఆమె చేసిన అవినీతితో మ‌న‌స్తాపానికి గురైన ఆమె భర్త అజయ్ కుమార్ బుధ‌వారం బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు. ఆయ‌న మృతదేహం హైద‌రాబాద్‌లోని ఉస్మానియా ఆస్ప‌త్రిలో ఉంది. త‌న‌‌ భ‌ర్త మృతిచెంద‌డంతో త‌హ‌సీల్దార్ సుజాత‌ బెయిల్ కావాల‌ని పిటిష‌న్ పెట్టుకుంది. దీంతో భ‌‌ర్త మ‌ర‌ణం నేప‌థ్యంలో తహసీల్దార్ సుజాతకు ఏసీబీ కోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి జైలు నుంచి సుజాతను బెయిల్‌పై విడుద‌ల చేశారు. ఆమె రావ‌డంతో గురువారం మధ్యాహ్నం అంబర్‌పేట‌ శ్మశానవాటికలో అజయ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే అజ‌య్ కుమార్ మ‌ర‌ణంపై అత‌డి సోద‌రి మంగ‌ళ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. త‌న త‌మ్ముడు మృతికి ఏసీబీ అధికారుల వేధింపులే కార‌ణ‌మ‌ని ఆమె ఆరోపించారు. సుజాత ఇంట్లో దొరికిన రూ.30 లక్షల నగదుకు సంబంధించి 24 లక్షల వరకు ర‌సీదు చూపించామని తెలిపారు. వైర‌స్‌ కారణంగా జైల్లో ములాకత్ రద్దు చేయడంతో అజయ్ త‌న‌ భార్య సుజాత‌ని క‌ల‌వ‌లేక‌పోయారు. సుజాత జైలుకు వెళ్లినప్ప‌టి నుంచి తన కొడుకుతో కలిసి అజ‌య్‌కుమార్ చిక్కడపల్లిలో ఉన్న అక్క మంగళ ఇంట్లో ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే అత‌డు ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి బుధ‌వారం ఆత్మహత్యకు పాల్పడిన విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News