తెలుగు రాష్ట్రంలో ఊహకందని పరిణామం జరగబోతోంది. మన బీచ్ లో ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ షకీరా చిందులేయబోతోంది. ఇది జస్ట్ రూమర్ అని కొట్టి పారేయకండి. రాబోయే ఫిబ్రవరిలో జరగబోయే బీచ్ ఫెస్టివల్ ను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అధికారులతో కలిసి వేసిన ప్లాన్ ఇది.
ఫిబ్రవరిలో సీఐఐ సమ్మిట్ తర్వాత జరబోయే బీచ్ ఫెస్టివల్ విషయంలో వస్తున్న వార్తలు ఇప్పటికే చర్చనీయాంశమవుతుండగా.. షకీరా విశాఖకు వచ్చి పెర్ఫామ్ చేయబోతోందన్న సమాచారం మరింత ఉత్సాహం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధి దిశగా ఈ బీచ్ ఫెస్టివల్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. దేశంలో అత్యంత అందమైన బీచుల్లో ఒకటైనప్పటికీ విశాఖకు రావాల్సినంత పేరు రాలేదు. ఐతే ఈ బీచ్ ఫెస్టివల్ తర్వాత అందరూ విశాఖ తీర అందాల గురించి చర్చించుకునేలా చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక.
షకీరా మూడు రోజుల పాటు ఈ బీచ్ ఫెస్టివల్లో కుర్రాళ్లకు సెగలు పుట్టించబోతోంది. సాగర్ నగర్.. తొట్లకొండ.. ఎర్రమట్టి దిబ్బలు బీచ్ ప్రాంతాల్లో ఆమె షోలు ఉంటాయని సమాచారం. ఈ బీచ్ ఫెస్టివల్లో కొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొని పెర్ఫామ్ చేసే అవకాశముంది. ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్లాన్ చేశారు. ఈ బీచ్ ఫెస్టివల్ ను ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ.. విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా నిర్వహించనున్నాయి.