ప్రపంచ నెంబర్ వన్ అల్ రౌండర్ ... బంగ్లాదేశ్ క్రికెట్ కి వెన్నెముక ... బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ పై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. అసలు ప్రపంచ మేటి క్రికెటర్స్ లో ఒకడిగా వెలుగొందుతున్న షకీబ్ కి ఐసీసీ లో ఉన్న నియమాల గురించి తెలియదా చెప్పండి ... అలాగే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సభ్యుడిగా ఉంటూ క్రికెట్ అభివృద్ధికి సలహా ఇచ్చే వాడిగా ఉంటూ తప్పు చేయడం ఏమాత్రం నీకు తగునా షకీబ్.
ఐసీసీ అవినీతి నిరోధక నియమాలను ఉల్లంఘించిన నేపథ్యంలో మంగళవారం అతడిపై రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఏడాది పాటు మినహాయింపు ఇవ్వడంతో వచ్చే ఏడాది అక్టోబర్ 29 నుంచి షకిబ్ తిరిగి క్రికెట్ ఆడే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎలాంటి క్రికెట్ ఆడలేడు.
భారత బుకీ దీపక్ అగర్వాల్.. ఓ వ్యక్తి ద్వారా షకిబ్ ఫోన్ నంబర్ తీసుకొని పలుసార్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు చేశాడు. 2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) సందర్భంగా నవంబర్‌లో తొలిసారి సంప్రదించగా.. తర్వాత 2018 జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో ఐపీఎల్లో మరోసారి సంప్రదించాడు. ఈ విషయాలను బంగ్లా ఆల్‌రౌండర్ ఎవరికీ చెప్పలేదు. కానీ, ఇటీవల ఐసీసీ విచారణ అధికారుల వద్ద తన నేరాన్ని అంగీకరించాడు.
బీపీఎల్ తర్వాత 2018 జనవరిలో బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌కు ఎంపికైనందున షకిబ్‌కు అభినందనలు తెలుపుతూ జనవరి 19న బుకీ దీపక్ మెసేజ్ చేశాడు. మనం ఇప్పుడు కలిసి పనిచేద్దామా లేక ఐపీఎల్ వరకు వేచి ఉండాలా అని ఆ సందేశంలో అడిగాడు. ఇక్కడ పనిచేద్దామా అనే పదం ఆ సిరీస్‌లో బంగ్లా జట్టు అంతర్గత ప్రణాళిక సమాచారాన్ని తెలుసుకోవడమనే అర్థంలో ఐసీసీ విచారణ అధికారులు భావించారు. అలాగే జనవరి 23న బ్రో ఈ సిరీస్‌లో ఏమైనా ఉందా అని మెసేజ్ చేశాడు.
ఇక ఐపీఎల్ సందర్భంగా ఏప్రిల్ 26న సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించి సమాచారం ఇవ్వాలని మరోసారి అడిగాడు. ఈ సందర్భంగా వారి మధ్య బిట్‌కాయిన్స్, డాలర్ అకౌంట్స్ సమాచారంపై సంభాషణలు జరిగాయి. అయితే, షకిబ్ మాత్రం దీపక్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు ఆసక్తి చూపించాడు. అప్పుడు జరిగిన సంభాషణ మొత్తం డిలీట్ అయిందని, అందులో జట్టు అంతర్గత సమాచారం ఇవ్వాలని దీపక్ కోరినట్లు షకిబ్ విచారణ అధికారుల వద్ద అంగీకరించాడు. అసలు ఒక టీం కెప్టెన్ గా ప్రపంచ నెంబర్ వన్ అల్ రౌండర్ గా ఉంటూ బుకీ సంప్రదిస్తే ఐసీసీ అధికారులకి చెప్పాలని కూడా తెలియదు అంటే నమ్మాలా ...ఏమైనా షకీబ్ క్రియేట్ ఇక ఏ మలుపు తిరుగుతుందో చూడాలి..