షేన్ వార్న్ పిల్లల మాటలు విన్నంతనే.. అప్రయత్నంగా కళ్లల్లో నీరు తిరగటం ఖాయం
స్పిన్ దిగ్గజం షేన్ వార్న్హ హఠ్మాన్మణం.. క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. సగటు అభిమానిని విషాదంలో ముంచెత్తింది. ఉన్నట్లుండి మాయమైన అతగాడి గురుతులు అందరిని వేధిస్తున్నాయి. ఉన్నప్పుడు విలువ తెలీదు.. లేనప్పుడు వారి లేని లోటు ఎంతన్నది కొందరి నిష్క్రమణ వేళలో అర్థమవుతుంటుంది. ఇప్పటివరకు వార్న్ ను అభిమానించి.. ఆరాధించే వాళ్ల వేదననే ప్రపంచం విన్నది. ఆయన కుటుంబ సభ్యుల మాటేమిటి? వారికి జరిగిన నష్టం మరెవరూ పూడ్చలేనిది. తాజాగా వారి స్పందన బయటకు వచ్చింది.
తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని చెబుతూ.. వారు చెప్పిన మాటల్ని విన్నంతనే కళ్ల వెంట అప్రయత్నంగా కన్నీళ్లు రావటం ఖాయం. షేన్ వార్న్ కు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు.. ఒక కొడుకు. వారికి తండ్రి అంటే ఎంత ఇష్టమన్న విషయాన్ని వారి మాటలు చెప్పేస్తాయి. వారికి ఎదురైన లోటును మరెవరూ పూడ్చలేనిది. తమ తండ్రి గురించి పిల్లలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చదివిన వారంతా తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. షేన్ వార్న్ తల్లిదండ్రుల ఆవేదన అయితే.. చెప్పాల్సిన పనే లేదు. తమ కుమారుడు లేని లోటును వర్ణించటానికి మాటలు రావట్లేదంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఇక.. పిల్లల విషయానికి వస్తే.. ‘‘మా నాన్నే నాకు బెస్ట్ ఫ్రెండ్. నా మనసులో మిగిల్చి వెళ్లిపోయిన శూన్యతను మరేదీ పూడ్చలేదు. పోకర్ టేబుల్ పక్కన కూర్చొని ఉండటం.. గోల్ఫ్ కోర్స్ లో వాకింగ్.. పిజ్జా తినటం.. ఇలా ఏదీ అప్పటిలా ఉండబోదు. నేనెప్పుడూ సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటావని నాకు తెలుసు. అందుకే ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తా’ అని షేన్ వార్న్ కొడుకు జాక్సన్ పేర్కొన్నారు.
ఇక.. వార్న్ పెద్ద కుమార్తె బ్రూక్ తన తండ్రి గురించి చెబుతూ.. ‘‘నాన్న.. నిన్నుచాలా మిస్ అవుతున్నా. నువ్వు నిజంగా ఉత్తమమైన తండ్రివి. నేను నిన్న చాలా ప్రేమిస్తున్నాను. విధి చాలా క్రూరమైంది. నా తండ్రిని చాలా త్వరగా తీసుకెళ్లిపోయింది. నవ్వుతూ.. సరదాగా మాట్లాడుకుంటూ ఉన్న చివరి గురుతులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. మనమిద్దరం చాలా విషయాల్లో సారూప్యత కలిగి ఉంటాం. మీ నుంచి వారసత్వంగా వచ్చింది. నాకు అదే కోపం తెప్పించిందని అప్పుడప్పుడూ నేను జోక్ చేస్తుండేదానిని’’ అన్న భావోద్వేగ మెసేజ్ కు కళ్లు చెమర్చాల్సిందే.
చిన్న కుమార్తె సమ్మర్ తన తండ్రి మరణం గురించి స్పందిస్తూ.. ‘‘మిమ్మల్ని నాన్న అని పిలవటం చాలా గర్వంగా ఉంటుంది. ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా డాడీ. ఇప్పటికే చాలా మిస్ అవుతున్నా. నేను నిన్ను గట్టిగా హత్తుకొని ఆనందించిన క్షణాలే నాకు చివరివి అవుతాయని ఊహించలేదు. మీతో గడపటానికి నాకు ఎక్కువ సెలవులు కావాలి. సంతోషంగా గడపాలి. మీ నవ్వు నేనున్న ప్రదేశాన్ని కాంతివంతం చేస్తాయి. గుడ్ నైట్.. ఐ లవ్వూ అని మీరు అనాలి. మీరు పక్కన ఉంటే మేమంతా ఎంతో సురక్షితంగా ఉంటామనే నమ్మకం.
మీరు మరణించలేదు నాన్న.. ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్లారంతా. అది కూడా మా మనసుల్లోకి’’ అంటూ ఆమె పెట్టిన బరువైన భావోద్వేగ సందేశం ప్రతి గుండెను తట్టి లేపేలా ఉంటుందని చెప్పాలి. తన పిల్లలకు తానెంత ఇష్టమన్న విషయాన్ని చూసుకొని షేన్ వార్న్ కన్నీళ్లు పెట్టుకోవటం ఖాయం. వారికి తన అనంతమైన ప్రేమను పంచి ఇవ్వటానికి వీల్లేని క్షణాలకు అతడు కుమిలిపోవటం ఖాయం.