చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సాన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు తాజాగా గుడ్ బై పలికినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో అతడు భావోద్వేగానికి గురై ఈ విషయాన్ని వెల్లడించాడని సమాచారం.
‘ఆఖరి మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో వాట్సాన్ భావోద్వేగంతో వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. చెన్నై తరుఫున ఆడటం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నాడు’ అని ఓ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దీనిపై షేన్ వాట్సాన్ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.
ఆస్ట్రేలియా తరుఫున ఆడిన ఈ దిగ్గజ ఆల్ రౌండర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2016లో రిటైర్ మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున ఐపీఎల్ లో ఆడాడు. 2018లో ఐపీఎల్ లో చెన్నై టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో రాణించడంతో చెన్నై మూడోసారి ట్రోఫీ గెలిచింది.ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడి 299 రన్స్ చేశాడు. అంతకుముందు 2008లో రాజస్థాన్ విజేతగా నిలవడంలోనూ వాట్సాన్ కీలక పాత్ర పోషించాడు.