ఆస్ర్టేలియాకు గత దశాబ్దకాలంలో దొరికిన ఆణిముత్యాల్లో ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఒకరు. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే సీరిస్ లో గాయపడిన వాట్సన్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. వాట్సన్ ఆస్ర్టేలియా క్రికెట్ టీంకు టెస్టులతో పాటు వన్డేలు, 20-20 క్రికెట్ లో కూడా ఎన్నో విజయాలు అందించాడు. ఓపెనింగ్ లో వచ్చినా..ఫస్ట్ డౌన్, టు డౌన్, ఆరో స్థానంలో వచ్చినా కూడా వాట్సన్ దూకుడుగానే ఆడతాడన్న బ్రాండ్ వేయించుకున్నాడు.
బ్యాటింగ్‌తో పాటు ఫేస్ బౌలింగ్ తో వాట్సన్ నెంబర్ వన్ ఆల్ రౌండర్ల లో ఒకడిగా నిలిచాడు. మరో విశేషం ఏంటంటే వన్డే మ్యాచ్ ల్లో వాట్సన్ ఇటు ఫేస్ బ్యాటింగ్ తో పాటు ఫేస్ బౌలింగ్ కు కూడా దిగేవాడు. 2005లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన వాట్సన్ ఇప్పటి వరకు 59 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. టెస్ట్ కేరీర్ లో 35 సగటు తో 4 సెంచరీలు నమోదు చేశాడు. వాట్సన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 175, 75 వికెట్లను కూడా అతడు తన ఖాతాలో వేసుకున్నాడు.
టెస్టులకు గుడ్ బై చెప్పిన వాట్సన్ వన్డే లు, 20-20ల్లో కొనసాగనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న యాషెస్ సీరిస్ ను 2-3 తేడాతో కోల్పోయిన ఆసీస్ వన్డే సీరిస్ లో మాత్రం విజృంభిస్తోంది. ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది. ఏదేమైనా 2003 నుంచి ఆస్ర్టేలియా విజయాల్లో ఆల్ రౌండర్ గా కీలకపాత్ర పోషిస్తున్న వాట్సన్ రిటైరవ్వడం ఆస్ర్టేలియా క్రికెట్ కు తీరని లోటే.