నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ నిజంగానే సత్తా కలిగిన నేతేనని చెప్పక తప్పదు. మహారాష్ట్రకు ఏకంగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించడమే కాకుండా మహారాష్ట్ర రాజకీయం అంతా తాను చెప్పినట్టుగా తిరిగేలా చేసిన పవార్ నిజంగానే సత్తా కలిగిన నేతే. ఈ మాట మరోమారు రుజువైపోయిందని కూడా చెప్పక తప్పదు. సరిగ్గా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ... కేసులతో తనను ఇబ్బందిపెట్టేలా జరిగిన యత్నాలను పవార్ తనదైన శైలి ఎదుర్కొంటున్నారు. పవార్ స్టామినా చూసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు నిజంగానే ముచ్చెమటలు పట్టిన వైనం చూస్తుంటే... పవార్ ను బెదిరించడం అంత వీజీ కాదని తేలిపోయింది.
అయినా ఏం జరిగిందన్న విషయానికి వస్తే.. మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు పలు చక్కెర ఫ్యాక్టరీలకు మంజూరు చేసిన రూ.25 వేల కోట్ల నిధుల వ్యవహారంలో పవార్ పాత్ర కూడా ఉందని, ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఆరోపణలతో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా రోజుల క్రితమే ఈ వ్యవహారంపై మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు జరుపుతూ ఉంటే... సరిగ్గా ఎన్నికలకు ముందు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. పవార్ తో పాటు ఆయన అల్లుడు అజిత్ పవార్ కు ఈ వ్యవహారంలో పాత్ర ఉందంటూ ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో ఈ కేసు పెను సంచలనంగా మారిపోయింది. మహారాష్ట్రలో ఎన్సీపీ మాదిరే మరో కీలక పార్టీగా ఉన్న శివసేనతో జట్టు కట్టిన బీజేపీ... కాంగ్రెస్ తో జట్టు కట్టిన ఎన్సీపీకి ఝలక్ ఇచ్చేందుకే ఈడీ కేసుయ నమోదైందన్న వాదనలు వినిపించాయి.
అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ... ఇలాంటి కేసులు పెడితే బెదిరిపోయేది లేదని తేల్చేసిన పవార్... ఎలాగూ ఈడీ కేసు నమోదు చేసింది కదా... తనకు నోటీసులు అందకున్నా... తానే స్వచ్ఛందంగా ఈడీ విచారణకు హాజరవుతానంటూ సంచలన ప్రకటన చేశారు. పవార్ నుంచి ఈ ప్రకటన రాగానే... ఈడీ అధికారులకు నిజంగానే తడిసిపోయిందని చెప్పక తప్పదు. తమ నోటీసులు అంటేనే నేతలంతా భయపడిపోతుంటే... పవార్ ఏంటీ నోటీసులు లేకుండానే విచారణకు వస్తానని ప్రకటించారని ఈడీ అధికారులు బెంబేలెత్తిపోయారు. అంతేకాకుండా ఎక్కడ లేట్ అయితే పవార్ ఏకంగా తమ కార్యాలయానికి వస్తారోనన్న భయంతో వణికిపోయిన ఈడీ అధికారులు... అప్పటికప్పుడు పవార్ కు ఓ లేఖ రాశారు. ఈ కేసులో విచారణకు మీరు ఇప్పుడే రావలసిన అవసర లేదు... అవసరం అయినప్పుడు తామే లేఖ రాస్తామంటూ ఓ రిక్వెస్ట్ లెటర్ పంపారు. ఈడీ రాసిన ఈ లేఖను చేస్తేనే పవార్ పవరేమిటో తెలిసిపోయిందని చెప్పక తప్పదు. మొత్తంగా నేతలను ఓ రేంజిలో భయపెడుతున్న ఈడీని పవార్ తనదైన స్టామినాతో వణికించేశారన్న మాట.