అందుకే అంటారు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని. పార్టీ అన్నంతనే పది మంది ఉండాలే తప్పించి.. ఏక నాయకత్వ ధోరణి ఏ మాత్రం మంచిది కాదని నెత్తి నోరు కొట్టుకున్నా పట్టించుకోని కమలనాథులకు.. మరీ ముఖ్యంగా మోడీ అండ్ కోకు ఇటీవల ఎదురవుతున్న షాకులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఒకప్పుడు బీజేపీ అన్నంతనే.. మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నమైన మైండ్ సెట్ తో ఉండే నాయకులు సమూహం అన్న పేరు ఉండేది.
అందుకు తగ్గట్లే.. జాబితా చూస్తే.. బోలెడంత మంది కమిట్ మెంట్ ఉన్న నాయకులు కనిపించేవారు. జాతీయ రాజకీయాల్లోకి మోడీఎంట్రీ ఇచ్చే వరకు ఇలాంటి పరిస్థితే నెలకొని ఉండేది. ఎప్పుడైతే ఆయన దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారో.. బీజేపీలో అగ్రనాయకత్వం అంటే.. మోడీషాలు తప్పించి మరెవరూ కనిపించకుండా ఉండేలా పరిస్థితిని గడిచిన ఏడేళ్లలో మార్చేశారు.
ఇప్పుడు బీజేపీ అంటే.. మోడీషాలు మాత్రమే. అద్వానీని ఎప్పుడో సోదిలో కలిపేశారు. ఆయన ఉనికి అన్నది లేకుండా చేశారు. రాజ్ నాథ్ సింగ్ లాంటి వారు కీలక పదవిలో ఉన్నా.. ఆయన నోటికి తాళం వేసేసి.. చేతులుకట్టేసినట్లుగా పరిమితులు విధించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా యూపీ ఎన్నికలతో సరికొత్త సవాలు ఎదురు కానుంది.
సర్వే లెక్కలన్నీ యోగి సర్కారుకు ఫుల్ మార్కులు వేసేస్తూ.. బీజేపీకి మరోసారి అధికారం ఖాయమన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి.. ఎన్నికల్లో గెలిచే పార్టీ వెనుక నేతలంతా ఉండటం.. ఆమాటకు వస్తే.. ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం గెలిచే పార్టీ వైపు రావటానికి ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు.
అలాంటిది.. యూపీలో ఇప్పుడు అందుకుభిన్నమైన పరిస్థితి నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసిన వేళ.. బీజేపీ నుంచి జంప్ అవుతున్న నేతలు ఎక్కువ అవుతున్నారు. సర్వే రిపోర్టుల ప్రకారం.. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చే నేతలు ఉండాలే కానీ.. కమలనాథుల పార్టీ నుంచి బయటకు వెళ్లే వారు తక్కువ ఉండాలి. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదంటున్నారు.
ఇప్పటికే యూపీ కార్మిక శాఖా మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన పదవికి.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరి షాకిచ్చారు. అనంతరంమరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఇలాంటి వేళ ఎంట్రీ ఇచ్చిన ఎన్సీపీ అధినేత కమ్ మరాఠా యోధుడు శరద్ పవార్ షాకింగ్ వివరాల్ని వెల్లడించారు. ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు పొలిటికల్ బాంబ్ మాదిరి మారింది. రానున్న రోజుల్లో 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీలో చేరబోతున్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
సమాజ్ వాదీ పార్టీ.. ఇతర చిన్న పార్టీలతో కలిసి యూపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా చెప్పిన ఆయన.. యూపీ ప్రజలు తప్పనిసరిగా మార్పును కోరుకుంటున్నట్లుగా చెప్పారు. యూపీలో తప్పనిసరిగా మార్పు చూస్తామన్న ధీమా వ్యక్తం కావటం గమనార్హం.
మతపరంగా ప్రజలను ఏకీకృతం చేసే పనులు యూపీలో మొదలయ్యాయని.. దీనికి ఆ రాష్ట్ర ప్రజలు గట్టిగా బదులిస్తారని చెబుతున్నారు. ఇక.. బీజేపీకి గుడ్ బై చెప్పేసి సమాజ్ వాదీ పార్టీలో చేరిన మాజీ మంత్రిస్వామి ప్రసాద్ మౌర్య.. యోగి సారథ్యంలోని బీజేపీ సర్కారు.. దళితులు.. రైతులు.. సూక్ష్మ.. మధ్య తరహా వ్యాపారాల్ని.. నిరుద్యోగ యువతను పట్టించుకోవటం మానేసిందని చెబుతున్నారు.
తన రాజీనామాకు కారణం అదేనని చెప్పిన ఆయన మాటలు ఇప్పుడు కమలనాథులకు కొత్త కంగారును పుట్టిస్తున్నాయని చెప్పక తప్పదు. మొత్తంగా చూస్తే.. ఏడు విడతల్లో జరగనున్న యూపీ ఎన్నికల ఫలితం మార్చి 10న బయటకు రానుంది. ఇప్పటివరకు బయటకు వచ్చిన అంచనాలు.. రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు మోడీషాలు జీర్ణించుకోలేని రీతిలో ఉంటాయన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.