రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో సోనియా బ్యాచ్‌ కు భారీ షాక్

Update: 2017-07-17 09:52 GMT
బ‌లం లేద‌ని తెలిసినా.. గెలిచే అవ‌కాశం అస్స‌లు లేద‌ని అర్థ‌మైనా పోటీకి దిగ‌టం రాష్ట్రప‌తి ఎన్నిక‌ల స్పెష‌ల్‌. మొద‌ట్లో ఏకాభిప్రాయ సాధ‌న‌కు ప్ర‌య‌త్నాలు.. ఆ త‌ర్వాత ఏదో సాకు చెప్పి త‌మ అభ్య‌ర్థిని బ‌రిలోకి దించ‌టం విప‌క్షాల‌కు మామూలే.

 ఈ తీరు మొద‌టి నుంచి వ‌స్తున్న‌దే. కాకుంటే.. ఈసారి మోడీ మార్క్ పుణ్య‌మా అని విప‌క్షాలు అడ్డంగా బుక్ అయ్యాయి. ఏకాభిప్రాయం కోసం ప్ర‌ధాని మోడీ తీవ్రంగా ప్ర‌య‌త్నించినా.. కావాల‌నే అభ్య‌ర్థిని బ‌రిలోకి దించే ప్ర‌య‌త్నం చేశార‌న్న వాద‌న‌ను దేశ ప్ర‌జ‌లు న‌మ్మేలా చేయ‌టంలో మోడీ స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి.

ఓడిపోవ‌టం ప‌క్కా అని తెలిసిన త‌ర్వాత కూడా రాష్ట్రప‌తి ఎన్నిక‌ల బ‌రిలో త‌మ అభ్య‌ర్థిని నిలిపిన సోనియా బ్యాచ్‌ కు కీల‌క‌మైన పోలింగ్ రోజున ఊహించ‌ని షాక్ త‌గిలింది. నిన్న‌టి వ‌ర‌కూ త‌మ వైపే ఉన్న మిత్ర‌ప‌క్షం.. రాత్రికి రాత్రి మ‌న‌సు మార్చేసుకొని అధికార‌ప‌క్షంవైపు ప్లేట్ మార్చేయ‌టంతో కాంగ్రెస్ అండ్ కోకు నోట మాట రాని దుస్థితి.

నిన్న‌టి వ‌ర‌కూ రెండు కూట‌ముల మ‌ధ్య పోటీ కాదు.. రెండు సిద్ధాంతాల మ‌ధ్య పోటీ అంటూ పెద్ద పెద్ద మాట‌లు చెప్పిన శ‌ర‌ద్ ప‌వార్‌.. పోలింగ్‌ కు కాస్త ముందు తాము అధికార‌ప‌క్ష అభ్య‌ర్థి ప‌క్షాన నిలుస్తున్న‌ట్లు చెప్పి షాకిచ్చారు. శ‌ర‌ద్ ప‌వార్‌ తో పాటు.. దీదీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే కోవింద్‌ కు త‌మ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు చెప్ప‌టం తెలిసిందే.

ఇలా అయిన వాళ్లు సైతం ఓట్లు వేయ‌కుండా.. ఏదో కార‌ణంతో అధికార‌ప‌క్షం గూటికి చేరిపోవ‌టం సోనియా బ్యాచ్‌ కు మింగుడుప‌డ‌ని వ్య‌వ‌హారంగా మారింద‌ని చెబుతున్నారు. పోలింగ్ జ‌రుగుతున్న వేళ‌నే ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డితే.. పోలింగ్ అయి.. ఓట్ల లెక్కింపు వేళ ఇంకెన్ని సిత్రాలు చోటు చేసుకుంటాయో అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. చూస్తుంటే.. రాష్ట్రప‌తి ఎన్నిక సోనియా అండ్ కోకు భారీ షాక్ త‌గల‌టం ఖాయ‌మంటున్నారు.
Tags:    

Similar News