త్వరలో పెళ్లి చెప్పి షాక్ నుంచి తేరుకోకముందే న్యూడ్ ఫోటోల్ని షేర్

Update: 2022-05-12 03:15 GMT
‘నా ఇష్టం’.. ‘నాకు తోచింది చేస్తా’.. ‘నేనేం అనుకుంటే అది చేస్తా’.. ‘నేను మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తే డిస్ట్రబ్ కావాలి.. కాకూడదంటే కాకూడదంతే అన్నట్లుగా తయారైంది సెలబ్రిటీల తీరు. తమకు సంబంధించిన సర్వాధికారాలు వారివే అన్న విషయంలో ఎవరూ ఎలాంటి అభ్యంతరం చెప్పరు. సమస్యంతా ఎక్కడ వస్తుందంటే.. వారి గురించి మాత్రమే ఆలోచించేవారు.. వారి కారణంగా దారుణంగా ప్రభావితమయ్యే వారి పరిస్థితి ఏమిటన్న దాని గురించి మాత్రం అస్సలు ఆలోచించరు. సోషల్ మీడియా ఎంట్రీకి ముందు పరిస్థితులు ఒకలా ఉండేవి. తమను తాము హాట్ టాపిక్ గా మార్చుకోవాలంటే చాలానే ప్రయత్నాలు చేయాల్సి వచ్చేవి.

ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో.. తమను తాము ప్రపంచానికి ఎలా చూపించుకోవాలన్నది సదరు సెలబ్రిటీల చేతుల్లోనే ఉండే పరిస్థితి. దీంతో.. ఒక్కొక్కరు ఒక్కో మైండ్ సెట్ ను ప్రదర్శిస్తూ.. వారిని అభిమానించే అభిమానుల్ని.. ప్రపంచ ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు. నటి సమంత గురించే తీసుకోండి. నాగచైతన్యతో విడాకుల ఎపిసోడ్ లో ఆమె గురించి ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే ఇట్టే ఫైర్ అయిపోతారు. అదే సమయంలో ఎవరి పనిలో వారున్న వేళలో.. తనకు తానుగా పోస్టులు పెట్టి అగ్గి రేపే విషయంలో సామ్ ది బాధ్యత కాదా? అన్న ప్రశ్నకు సమాధానం లభించదు.

ఆమెకు తోచినట్లుగా ఆమె ఎలా అయితే వ్యవహరించేందుకు ఆమెకు హక్కు ఉంది. కానీ.. ఆమె కారణంగా లక్షలాది మంది ప్రభావితం కావటం..కొన్ని కోట్ల గంటలు ఆమె గురించి వేస్టు అవుతున్నప్పుడు.. వారిలో ఒకరు తమకు తోచింది చెప్పే హక్కు ఉండదా? అన్నది ప్రశ్న. ఇదంతా ఎందుకంటే.. తాజాగా ప్రముఖ గాయని ఒకరు చేసిన పనిని చూసినప్పుడు ఈ వాదనంతా మనసులో సుడులు తిరగటం ఖాయం.

లేటు వయసులో తన పెళ్లి కబురును ప్రపంచానికి చెప్పి అందరికి షాకిచ్చారు పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్. సుమారు పదమూడేళ్ల పాటు తండ్రి సంరక్షణలో జీవితాన్ని గడిపిన ఆమె.. కోర్టులో బలంగా పోరాడి.. న్యాయస్థానంలో కేసును గెలిచి.. తండ్రి చెర నుంచి బయటకు వచ్చారు. నచ్చినోడిని.. తనకంటే చాలా చిన్నవాడిని త్వరలో పెళ్లాడనున్న ఆమె.. అనూహ్యంగా తన న్యూడ్ ఫోటోల్ని ప్రపంచం మీదకు వదిలి.. ఉక్కిరిబిక్కిరి చేశారు.

‘నా కడుపులో బేబీ ఉన్నప్పుడు.. నేను మెక్సికోలో ఉన్న సమయంలో దిగిన ఫోటో అంటూ ఆమె షేర్ చేసిన ఫోటోలు ఆమె రెండు అరచేతుల్ని వక్షోజాలకు అడ్డుగా పెట్టుకొని.. దిగిన ఫోటో షాక్ కు గురి చేస్తోంది. ఎందుకిలా? చేస్తోందన్న ప్రశ్నకు సమాధానం లేదు. కొందరికి నగ్నత్వాన్ని ప్రదర్శించుకోవటాన్ని సంతోషంగా భావిస్తారు. వారి వరకు సరే.. ప్రపంచంలో చాలా రకాల మనస్తత్వాల మనుషులు ఉంటారని.. అలాంటి వారిని డిస్ట్రబ్ చేయటం ఎంతవరకు ధర్మం బిట్ని స్పియర్ అన్నది ప్రశ్న. ఏమైనా పెళ్లికి ముందు.. తన నగ్నత్వాన్ని పూర్తిగా ప్రపంచానికి చూపించాలన్న ఆమె అభిలాషను ఆమెను అమితంగా అభిమానించి.. ఆరాధించే అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.
Tags:    

Similar News