డోలుపై మద్దెలకు ఫిర్యాదు.. గవర్నర్ తో షర్మిల భేటి అంతేనా?

Update: 2022-12-01 12:24 GMT
తెలంగాణ గవర్నర్ తమిళిసై మొదటి బాధితురాలు. కేసీఆర్ సర్కార్ చేతిలో అడుగడుగునా అడ్డంకులు అవమానాలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రథమ పౌరురాలు ఆమె. కనీసం తెలంగాణలో ప్రొటోకాల్ కూడా ఆమెకు దక్కడం లేదు. బీజేపీ మనిషిగా కేసీఆర్ తో తలపడుతోంది గవర్నర్.

ఇక ఇప్పుడిప్పుడే పాదయాత్ర అంటూ బయలు దేరి తెలంగాణ సర్కార్ పై విమర్శల వాడి పెంచుతోంది వైఎస్ షర్మిల. ఇటీవల పాదయాత్ర, ప్రగతిభవన్ అంటూ హల్ చల్ చేయడం.. పోలీసులు అరెస్ట్ లు చేయడం జరిగిపోయింది.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తాజాగా కేసీఆర్ సర్కార్ తనను అరెస్ట్ చేసి పాదయాత్రకు అడ్డంకులు కల్పించడంపై గవర్నర్ తమిళిసైని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. నిజానికి గవర్నరే కేసీఆర్ చేతుల్లో బాధితురాలి. అలాంటి గవర్నర్ తో షర్మిల భేటి డోలు వెళ్లి మద్దెల తో మొరపెట్టుకున్నట్టే ఉంటుంది.

నర్సంపేటలో ప్రజాప్రస్థానం పాదయాత్రలో చోటుచేసుకున్న పరిణామాలను, తాను బస చేసే బస్సును తగులబెట్టడాన్ని ఆపై రాళ్లదాడి చేసి ఇబ్బంది పెట్టడాన్ని తమిళిసై దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం పాదయాత్రను అడ్డుకోవడాన్ని ప్రగతి భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళుతుంటే చోటు చేసుకున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్ కు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు.

నర్సంపేటలో ప్రజాస్వామ్య విధంగా పాదయాత్ర చేస్తున్న క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించిన వైఎస్ షర్మిల తమ బస్సును తగలబెట్టిన వారిని, తమ పార్టీ కార్యకర్తలను కొట్టిన వారిని తమపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు తెలియజేశారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను గవర్నర్ వద్ద ప్రస్తావించిన వైఎస్ షర్మిల , తనపై జరిగిన దాడికి సంబంధించి అన్ని వివరాలు గవర్నర్ కు ఇచ్చారు. గవర్నర్ తమిళిసై ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News