తండ్రి బాటలోనే తనయ: పార్టీ పెట్టిన తరువాత షర్మిల ఇలా చేస్తారట..?

Update: 2021-02-09 14:30 GMT
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టడం ఖాయమని చేసిన ప్రకటన  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె కొత్త పార్టీపై వస్తున్న ఊహాగానాలు తెరదించుతూ తెలంగాణలో పార్టీలో ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల కొందరు వైఎస్ఆర్ అభిమానులతో సమావేశమై ఈ మేరకు తేల్చేశారు.

నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలతో నిర్వహిస్తున్న సమావేశం తరువాత పార్టీపై ప్రకటించారు.. అంతకుముందు వైఎస్ షర్మిల కొత్త పార్టీపై వార్తలు వచ్చినా.. కొందరు అవి నిజం కావన్నారు.కానీ షర్మిల లోటస్ ఫౌండ్ కి రావడంతో  ఇక్కడికి వైఎస్ అభిమానులు, అప్పటి కార్యకర్తలు నిన్న భారీగా తరలివచ్చారు.  పార్టీ ప్రకటన ఉంటుందని తెలిపిన షర్మిల ఇప్పుడు ఏం చేస్తారు..? ప్రస్తుతం ఎన్నికల హడావుడి కూడా లేని సమయంలో ఆమె కార్యాచరణ ఏంటనే దానిపై రకరకాల  వాదనలు వస్తున్నాయి.  ఆమె తండ్రి వైఎస్ బాటలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో అనుబంధం ఉంది. 2003లో ఆయన చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు.  అక్కడి నుంచి 1,467 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దీంతో 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత సైతం ఇదే నియోజకవర్గం నుంచి పలు పథకాలను ప్రారంభించారు.

వైఎస్ బాటలోనే జగన్ పాదయాత్ర చేసి ఏపీకి సీఎం అయ్యారు. దీంతో షర్మిల సైతం తెలంగాణలో పార్టీ పెట్టినందున చేవెళ్ల నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పుడు షర్మిల కూడా ఇక్కడి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నిరోజులు పాదయాత్ర చేస్తున్నారో ఆమె త్వరలోనే చెప్పనున్నారట.. ఇక జగన్ పై కోపం ఉంటే ఆంధ్రలో పార్టీ పెట్టాలి గానీ.. తెలంగాణలో పార్టీ ఎందుకు పెడుతున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. కానీ తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కొందరు వైఎస్ అభిమానులు సమాధానమిస్తున్నారు.
Tags:    

Similar News