టీఆర్ ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసిన‌ట్లే!!

Update: 2018-10-03 12:40 GMT
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల వేడి మొద‌లైన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లోని ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో అక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం క్ర‌మ‌క్ర‌మంగా వేడెక్కుతోంది. మ‌రోసారి అధికారం చేజిక్కించుకోవాల‌ని చూస్తోన్న టీఆర్ ఎస్ ను నిలువ‌రించేందుకు కాంగ్రెస్ తో పాటు ప్ర‌తిప‌క్షాలు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధ తార‌స్థాయికి చేరింది. కాంగ్రెస్ నేత‌ల‌పై టీఆర్ ఎస్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమర్శ‌లు గుప్పిస్తోన్న నేప‌థ్యంలో....తాజాగా టీఆర్ ఎస్ పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌శి థ‌రూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు ఓటు వేస్తే...కేంద్రంలో బీజేపీకి ఓటు వేసిన‌ట్లేన‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ కు మ‌ధ్య చీక‌టి ఒప్పందం కుదిరింద‌ని కాంగ్రెస్ తో పాటు ప్ర‌తిప‌క్షాలు కొద్ది రోజులుగా ఆరోపిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఆ వ్యాఖ్య‌ల‌ను బ‌ల‌ప‌రుస్తూ శ‌శి థ‌రూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన ఆల్ ఇండియా ప్రొఫెష‌న‌ల్ కాంగ్రెస్ స‌మావేశంలో పాల్గొన్న శ‌శి థ‌రూర్....మోదీ, కేసీఆర్ ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోదీ, కేసీఆర్ ల‌ను ఎన్నుకొని ప్ర‌జ‌లంద‌రూ చాలా మూల్యం చెల్లించుకున్నార‌ని గుర్తు చేసేందుకు మరి కొద్ది నెల‌ల స‌మ‌యం మిగిలి ఉంద‌ని శ‌శి థ‌రూర్ అన్నారు. ఢిల్లీలోని మోదీ స‌ర్కార్ కు కేసీఆర్ స‌ర్కార్ పెద్ద తేడా లేద‌ని అన్నారు. మోదీ తీసుకున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌కు కేసీఆర్ వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని, ఆ ఇద్ద‌రూ....ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై, రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌పై టీఆర్ ఎస్ నేత‌లు ఎటువంటి విమ‌ర్శ‌లు చేయ‌డం లేద‌ని, ఆ రెండు పార్టీల మ‌ధ్య చీక‌టి ఒప్పందం ఉంద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని శ‌శి థ‌రూర్ అన్నారు. దేశాన్ని కుదిపేస్తోన్న రాఫెల్ డీల్ వివాదంపై టీఆర్ ఎస్ ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.
Tags:    

Similar News