కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు జోథ్ పూర్ సెషన్స్ కోర్టు...ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ కు బాసటగా పలువురు సెలబ్రిటీలు నిలిచారు. ముంబైలోని సల్మాన్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పలువురు సెలబ్రిటీలు పరామర్శిస్తున్నారు. తాజాగా, బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా, కుమార్తె సోనాక్షి సిన్హాలు సల్మాన్ కుటుంబసభ్యులను కలిసి తమ సంఘీభావం తెలిపారు. సల్మాన్ కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణజింకల వేట కేసులో సల్మాన్ ఇప్పటికే చాలా కుమిలిపోయారని, ఆయనకు ఇప్పుడు మళ్లీ శిక్ష వేశారని శత్రుఘ్న సిన్హా అన్నారు.
తనకంటే ముందుగా తన కూతురు సోనాక్షి సల్మాన్ ఇంటికి చేరుకొని అతడి కుటుంబ సభ్యులను ఓదార్చిందని శత్రుఘ్న సిన్హా అన్నారు. తమ కుటుంబానికి, సల్మాన్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయని అన్నారు. సల్మాన్ త్వరలోనే విడుదల అవుతారడని ఆయన తండ్రి సలీమ్ తో పాలు తామంతా నమ్ముతున్నామని అన్నారు. తనకు న్యాయవ్యవస్థపై , న్యాయ ప్రక్రియపై, తీర్పు నిచ్చిన న్యాయమూర్తిపై చాలా గౌరవముందని అన్నారు. సల్మాన్ గత 20ఏళ్లుగా ఈ కేసులో కోర్టుల చుట్టూ తిరుగున్నాడని, తాజాగా మరో ఐదేళ్ల శిక్షతో కలిపి మొత్తంగా 25ఏళ్లు శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు. తనకు తెలిసి సల్మాన్ ఓ పెద్ద స్టార్ కాబట్టే ఇంత పెద్ద శిక్ష వేసి ఉంటారని తాను అనుకుంటున్నానని చెప్పారు. సల్మాన స్థానంలో ఒక సామాన్య వ్యక్తి ఉంటే....నేరం చేశారా...లేదా అన్న సంగతి పక్కనపెడితే...ఈ రకంగా పాతికేళ్లు బాధపడేవారు కాదని అన్నారు. తాను చూసిన వారిలో సల్మాన్ ఎంతో దయార్ధ్ర హృదయుడని, అవసరంలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తాడని కొనియాడారు. సల్మాన్ వంటి వ్యక్తి బయట ఉంటే ఎన్నో మంచి పనులు చేస్తాడని, ఒకవేళ అతడికి శిక్ష వేయాలనుకుంటే సమాజ సేవ చేయమని శిక్ష వేయాలని ఆయన కోరారు.