పురట్చితలైవి జయలలిత తమిళనాడు రాజకీయాలను ఏ రీతిగా కను సైగలతో శాసించారో అందరికీ తెలుసు. పార్టీలో చిన్నా పెద్దా తేడా లేకుండా నాయకులందరూ కూడా తనంటే వణికిపోయే స్థాయి పెత్తనం ఆమెది. అలాంటి జయలలిత ఇప్పుడు ఆస్పత్రి బెడ్ మీద ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మార్పుచేర్పులు జరుగుతున్నాయి. రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుకవ్రారం నాడైతే.. దాదాపుగా కాసేపట్లో కొత్త ముఖ్యమంత్రి గురించి ప్రకటన వచ్చేస్తుంది అన్నంత హడావిడి జరిగింది. తర్వాత అది చల్లబడింది.
అయితే ఇలా రేగుతున్న పుకార్లను చల్లబరచడమూ.. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా, అంతా తను అనుకున్నట్లే జరిగేలా వ్యవహారాల్ని శాసించడమూ ఇవన్నీ ఒకే ఒక్క మహిళ ఆధ్వర్యంలో , ఇష్టాయిష్టాలకు అనుగుణంగా జరుగుతున్నాయి.
ఇలా అనగానే.. సదరు మహిళ ఎవరంటే... జయలలిత నెచ్చెలి శశికళ అని అందరూ అనుకుంటారు. కానీ అంతకంటె కీలకంగా చక్రం తిప్పుతున్న మహిళ మరొకరు ఉన్నారనేది తమిళనాట చాలా ఎక్కువగా వ్యాపిస్తున్న ప్రచారం. ఆమె పేరు షీలా బాలకృష్ణన్. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన షీలా బాలకృష్ణన్ మాట మీదే సమస్త వ్యవహారాలు నడుస్తున్నాయని అంతా అనుకుంటూ ఉంటారు. జయలలిత పరిపాలన సాగిస్తున్న రోజుల్లో కూడా ఆమె నిర్ణయాల మీద ఈమె ప్రభావం, ముద్ర చాలా ఎక్కువగా ఉండేదనే ప్రచారం తమిళనాట ఉంది. అలాంటి షీలా బాలకృష్ణన్ ఇప్పుడు అపోలో ఆస్పత్రిలో జయలలిత బెడ్ ఉన్న గదికి పక్కనే మరో గదిలో తాను ఉంటూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని మొత్తం శాసిస్తున్నారనేది ఒక పుకారు.
మొత్తానికి.. జయలలిత- ఆమె వ్యవహారాల్ని శశికళ కాకపోతే షీలా బాలకృష్ణన్.. చాలా గుంభనంగానే శాసిస్తున్నారు మరి!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/