టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఎప్పుడెలా ఆడతాడో ఎవరికీ తెలియదు. అందరూ అంచనాలు పెట్టుకున్నపుడు తుస్సుమనిపిస్తాడు. తననెవరూ పట్టించుకోని సమయంలో చెలరేగిపోతుంటాడు. బుధవారం శ్రీలంకతో ఆరంభమైన తొలి టెస్టులో తొలి రోజు ధావన్ ఇన్నింగ్స్ అలాంటిదే. టెస్టు మ్యాచ్ లో వన్డే తరహాలో ఆడిన ధావన్ 168 బంతుల్లోనే 190 పరుగులు చేసేశాడు. అందులో 31 ఫోర్లుండటం విశేషం. అసలే బలహీనంగా ఉన్న శ్రీలంక జట్టు.. ధావన్ ధాటికి బెంబేలెత్తిపోయింది. తొలి రోజే దాదాపుగా మ్యాచ్ పై ఆశలు వదిలేసుకుంది. ఐతే ధావన్ ఈ మ్యాచ్ లో ఆడాల్సిన వాడే కాదంటే ఆశ్చర్యపోవాల్సిందే. అతను ఈ సమయానికి మెల్ బోర్న్ లో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉండాల్సింది. కానీ అనుకోకుండా శ్రీలంకకు వచ్చాడు.
గతంలో టీమ్ ఇండియాకు రెగ్యులర్ ఓపెనర్ గా ఉన్న ధావన్.. వరుస వైఫల్యాలతో జట్టులో చోటు కోల్పోయాడు. వన్డేల్లో అయినా మళ్లీ చోటు దక్కించుకున్నాడు కానీ.. టెస్టుల్లో అవకాశం దక్కలేదు. భారత్ ఆడిన గత 12 టెస్టుల్లో ధావన్ లేడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ కు కూడా ధావన్ ఎంపిక కాలేదు. నెల కిందటి ఛాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ఇన్నింగ్సులు ఆడినప్పటికీ టెస్టుల్లో అతడికి అవకాశం ఇవ్వలేదు. దీంతో ధావన్ చాలా బాధపడ్డాడట. ఐతే దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా తన భార్య పుట్టిల్లయిన మెల్ బోర్న్ కు వెళ్లి పిల్లలతో కలిసి హాలిడే ఎంజాయ్ చేసి రావాలనుకున్నాడు. ఆ టూర్ కోసం టికెట్లు బుక్ అయిపోయాయి. అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. ఇంతలో మురళీ విజయ్ గాయపడ్డాడు. శ్రీలంకతో సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో ధావన్ కు అనుకోకుండా సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది. ఇక బుధవారం బరిలోకి దిగిన ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టేశాడు.
ఇక్కడ ధావన్ భార్య గురించి కొన్ని ముచ్చట్లు చెప్పాలి. తన పేరు ఆయేషా ముఖర్జీ. ఆమె పుట్టింది పెరిగింది ఆస్ట్రేలియాలోనే. తన తల్లి బెంగాలీ. తండ్రి ఇంగ్లాండ్ కు చెందిన బాక్సర్. వారి కుటుంబంలో మెల్ బోర్న్ లో స్థిరపడింది. ఆయేషాకు ఇంతకముందే పెళ్లయింది. ఇద్దరమ్మాయిలు కూడా ఉన్నారు. తన తొలి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమెను హర్భజన్ ఫేస్ బుక్ ద్వారా ధావన్ కు పరిచయం చేయగా.. ఇద్దరికీ చక్కటి స్నేహం కుదిరింది. తర్వాత ప్రేమలో పడి.. పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత శిఖర్-ఆయేషాలకు ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు ముగ్గురు పిల్లల్నీ చక్కగా చూసుకుంటోంది ఈ జంట.