ధావన్ సౌతాఫ్రికాలో..ఫ్యామిలీ దుబాయ్‌ లో..!

Update: 2017-12-29 14:22 GMT
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌ కు చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి ముంబై నుంచి మిగతా టీమ్‌ తోపాటు కలిసి ధావన్ సౌతాఫ్రికాకు బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే దుబాయ్‌లో కేప్‌ టౌన్ విమానం ఎక్కే సమయంలో అక్కడి ఎమిరేట్స్ ఎయిర్‌ లైన్స్ సిబ్బంది అతని కుటుంబాన్ని అడ్డుకున్నారు. ఎందుకంటే....పుట్టిన తేదీ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేకపోవడమే! ఇక చేసేది లేక ధావన్ ఒక్కడే మిగతా టీమ్‌ తోపాటు కేప్‌ టౌన్ రాగా.. అతని భార్యా - పిల్లలు దుబాయ్‌ లోనే ఉండిపోయారు. కావాల్సిన డాక్యుమెంట్లు అందిన తర్వాత వాళ్లు సౌతాఫ్రికా విమానం ఎక్కనున్నారు.

త‌న‌కు జ‌రిగిన ప‌రాభ‌వంపై ధావన్ తీవ్రంగా మండిపడ్డాడు. ఎమిరేట్స్ ఎయిర్‌ లైన్స్ తీరును ఖండిస్తూ ఓ ట్వీట్ చేశాడు.  ఒకవేళ ఇలాంటి నిబంధ‌న‌లు ఏమైనా కావాలంటే ముంబైలోనే ఎందుకు అడ్డుకోలేదని అతను ప్రశ్నించాడు. `నా భార్య - పిల్లలకు దుబాయ్‌ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లే విమానానికి బోర్డింగ్‌ ఇవ్వలేదు. మా పిల్లల జనన ధృవీకరణ పత్రాలు సమర్పించాలని కోరారు. ఆ సమయంలో అవి అందుబాటులో లేవు. వాటికోసం వారు దుబాయ్‌ ఎయిర్‌ పోర్టులో నిరీక్షిస్తున్నారు.`  అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

మరోవైపు జనవరి 5న మొదలయ్యే తొలి టెస్ట్‌లో ధావన్ ఆడతాడో లేదో అనుమానంగా మారింది. ఎడమ కాలి మడమ గాయంతో ధావన్ బాధపడుతున్నాడు. ఒకవేళ అతను ఆడకపోతే.. విజయ్‌ తో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు.

Tags:    

Similar News