మహారాష్ట్రలో కాంగ్రెస్ - శివసేన మధ్య సిధ్ధాంత పరంగా ఎన్నో తేడాలు - విభేదాలు ఉంటూ వచ్చాయి. ముఖ్యంగా కూటమి ఏర్పాటు కోసం శివసేన.. తన హిందుత్వ సిధ్ధాంతాన్ని వదిలి.. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టింది. రాజకీయ ఎత్తుగడల్లో సీఎం పదవి నుంచి ఫడ్నవీస్ తప్పుకోవడంతో మహారాష్ట్రలో శివసేన -ఎన్సీపీ -కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఫడ్నవీస్ వైదొలిగిన కొద్దిగంటల్లోనే సమావేశమైన శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ‘మహా వికాస కూటమి’ నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రే (59)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎపిసోడ్ శివసేన గెలిచినట్లుగాక నిపిస్తున్న ఆ పార్టీ కార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తోంది. శివసేనతో సుమారు 20 ఏళ్ళకు పైగా అనుబంధం ఉండి ఆ పార్టీ కార్యకర్తగా చురుగ్గా.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వఛ్చిన రమేష్ సోలంకి అనే కార్యకర్త తన పదవికి రాజీనామా చేశాడు. అంతేకాకుండా మరాఠా పార్టీ నాయకత్వంపై మండిపడ్డాడు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో బుధవారం బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కొద్దిగంటల్లోనే రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. ఫడ్నవీస్ ఎవరి బలం ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ ఎన్సీపీ నేత అజిత్ పవార్ తొలుత తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేనని భావించిన దేవేంద్ర ఫడ్నవీస్ గత్యంతరం లేని పరిస్థితుల్లో మీడియా ముందుకొచ్చి ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించగా ఉద్దవ్ కాంగ్రెస్-ఎన్ సీపీ పొత్తుతో సీఎం పీఠం అధిరోహించేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా రమేష్ సోలంకీ ఆవేదన వ్యక్తం చేశాడు. `రాష్ట్రంలో శివసేనకు చెందిన అధినేత ముఖ్యమంత్రి కావడం - ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. అయితే, కాంగ్రెస్ పార్టీతో చెలిమి అన్న విషయాన్ని నా అంతరాత్మ అంగీకరించడం లేదు. శివసేనతో కలిసి ఇక పని చేయాలని భావించడం లేదు. బాదాతప్త హృదయంతో పార్టీ రాజీనామా చేస్తున్నా.. నా పార్టీకి - సహ శివసైనికులకు - నా పార్టీ నేతలకు వీడ్కోలు చెబుతున్నాను ‘ అని రమేష్ ప్రకటించాడు. ‘ నా జీవితంలోనే అత్యంత హృదయ భారంతో ఈ క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నా ‘ అని ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. కాగా, తమ ప్రభుత్వం ఏర్పాటు కానుందనే ఎందరు శివసైనికులు ఉన్నారో...కాంగ్రెస్-ఎన్ సీపీలతో సర్కారు ఏర్పడటంపై కూడా అదే రీతిలో కార్యకర్తలు ఆందోళనగా ఉన్నారని సమాచారం.