ప్రపంచంలోనే ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టాగ్రామ్ చిక్కుల్లో పడింది. జనాదరణ పొందిన ఈ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల తన యాప్‌లో జోడించిన వివాదాస్పద స్టిక్కర్‌పై పెద్ద ఇబ్బందుల్లో పడింది. ఈ ప్రత్యేకమైన స్టిక్కర్‌లో శివుడు ఒక వైపు వైన్ గ్లాస్, మరోవైపు మొబైల్ ఫోన్ పట్టుకున్నాడు. దీన్ని గమనించిన వినియోగదారులు దీన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకున్నారు.
చివరకు ఈ సమస్య కొన్ని హిందూ సంఘాల వారికి చేరుకుంది. వారు ఇన్ స్టాగ్రామ్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. న్యూ ఢిల్లీలో ఒక బిజెపి నాయకుడు ఇన్‌స్టాగ్రామ్‌కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ స్టిక్కర్లను ఇన్‌స్టాగ్రామ్ అభివృద్ధి చేసిందని, ఫిర్యాదుదారుడు మా మనో భావాలు, హక్కులకు భంగం వాటిల్లిందని చర్యలు తీసుకోవాలని కోరారు.
" హిందువుల దేవుడు శివుడిని అటువంటి స్థితిలో చిత్రీకరించడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశపూర్వక ప్రయత్నం ఇది. ఇన్‌స్టాగ్రామ్‌పై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం, సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ”అని బిజెపి నాయకుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటివరకు చేసిన అరుదైన తప్పులలో ఇది ఒకటి. భారతదేశంలో ఇటీవలి కాలంలో సోషల్ మీడియా చేష్టలు భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అత్యంత ప్రజాస్వామ్య.. మత దేశంలో, సోషల్ మీడియా దిగ్గజాలు వారి చర్యల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.