అధికారపక్షం తీసుకునే నిర్ణయాల్ని మిత్రపక్షాలు స్వాగతించి.. అండగా నిలబడతాయి. తాజాగా పలు రాష్ట్రాల్లో బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి విపక్షాల సంగతి తర్వాత.. మిత్రపక్షాలే వ్యతిరేకించే పరిస్థితి.
గొడ్డు మాంసం..చికెన్.. చేపల అమ్మకాల్ని మూడు రోజుల పాటు నిలిపివేయాలంటూ మహారాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కొంత మంట పుట్టిస్తోంది. మహారాష్ట్ర బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని.. ఆ పార్టీకి మిత్రపక్షమైన శివసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మహారాష్ట్రతో పాటు ఇలాంటి ఆంక్షల్నే జమ్మూకాశ్మీర్.. రాజస్తాన్ లలోనూ అమలు చేస్తున్నారు.
జైనుల పవిత్ర దినాల్ని పురస్కరించుకొని గొడ్డు మాంసం.. చికెన్.. చేపల అమ్మకాల్ని మూడు రోజుల పాటు నిలిపివేయాలంటూ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ముంబయి విడుదల చేసిన ఉత్తర్వులపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఒక మతానికి సంబంధించిన వారి మనోభావాల్ని గౌరవించే సమయంలో.. తమ ఆహార అలవాట్లను వదిలేయాలా? అన్నది మిగిలిన పక్షాల వాదన. మాంసం ఉత్పత్తులపై పరిమిత కాలంపాటైనా ఆంక్షలు విధించటం అనవసరమైన వ్యవహారంగానే చెప్పాలి. ఎందుకంటే.. శాఖాహారులు తాము తినే ఆహారాన్ని ఎంతగా ఇష్టపడతారో.. మాంసాహారుల పరిస్థితి అంతే.
ఎవరో ఒకరి కారణంగా.. తమ ఆహార అలవాట్లను మార్చుకోవాలనుకోవటం..నియంత్రించటం ప్రభుత్వ స్థాయిలో చేయటం సరైన చర్య కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాంసం తినటం ఆరోగ్యానికి హానికరమేమీ కాదన్న నేపథ్యంలో.. ఎవరో కొందరి మనోభావాల కోసం మిగిలిన వారంతా త్యాగం చేయటం ఏ మాత్రం సబబు కాదనే చెప్పాలి.
మాంసం.. చేపలు అమ్మకాలపై విధిస్తున్న ఆంక్షలు సరికొత్త వివాదానికి కారణం అవుతున్నాయి. దీనికి మతం రంగు పూసే వారున్నారు. మిగిలిన రాష్ట్రాల సంగతి కాసేపు పక్కన పెడితే.. మహారాష్ట్రలో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని శివసేన తీవ్రంగా వ్యతిరేకించటంతో పాటు.. ప్రత్యేకంగా మాంస దుకాణాల్ని ఏర్పాటు చేయటం మిత్రుల మధ్య మరింత మంట పుట్టిస్తోంది.
ఏది ఏమైనా కొన్ని సున్నిత అంశాలకు సంబంధించి నిర్ణయాన్ని తీసుకునే సమయంలో.. అందరి ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకోవాలన్న విషయం మర్చిపోకూడదు. జైనుల పవిత్ర దినాలు కాబట్టి శాఖాహారమే ఉండాలని నిర్ణయం తీసుకున్న సర్కారు.. భవిష్యత్తులో మరో ప్రభుత్వం వచ్చి.. బక్రీద్ సందర్భంగా కేవలం అందరూ మాంసాహారమే తినాలని నిర్ణయం తీసుకుంటే? ఇలాంటి ప్రశ్నలు ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందుకే.. అందరి మనోభావాలను పరిరక్షించేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతేకానీ.. ఒక సమూహానికి పెద్దపీట వేయటం రాజ్యధర్మం కాదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.