శివాజీ జాండీస్ సెంటిమెంట్!

Update: 2015-05-09 09:54 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడమే లక్ష్యంగా సినీనటుడు శివాజీ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెల్లిసిందే! అయితే ప్రత్యేక హోదా వివాదం రోజు రోజుకూ ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో దీక్ష విరమించి ఆస్పత్రిలో కోలుకున్న అనంతరం శివాజీ మాట్లాడారు! ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను చేపట్టిన దీక్షకు మద్దతు పలికి సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు సినీనటుడు శివాజీ. ప్రత్యక్షంగా దీక్షకు సహకరించిన వారికి, దీక్షా స్థలికి రాలేకపోయినా, దూరం నుండే శివాజీకి మద్దతు పలికిన వారికీ శివాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు!
ఇదే సమయంలో శివాజీ... ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు! 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో వుండగా తనకు జాండీస్ ఎటాక్ అయిందని... అప్పుడు బీజేపి ఎన్నికల్లో గెలిచిందన్న శివాజీ... ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టిన సమయంలో కూడా తనకు జాండీస్ వ్యాది సోకిందని వైద్యులు నిర్ధారించారని అన్నారు! ఈ రెండు పరిణామాలు ఒకదానికొకటి పోల్చుకుని చూస్తోంటే... తన జాండీస్ సెంటిమెంట్ దృష్ట్యా చూసుకుంటే...  బీజేపీ అధికారంలోకి వచ్చినట్లుగానే ఏపీకి కూడా ప్రత్యేక హోదా వస్తుందని గట్టి నమ్మకం కలుగుతోందని శివాజీ ఆశాభావం వ్యక్తంచేశారు. చెప్పిన విషయం సరదాది అయినా... అతని కమిట్ మెంట్ బాగుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!
ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా తప్పక ఇస్తామని ఎన్నికల వేళ వాగ్ధానాలు చేసిన బీజేపీనేతలవి జిత్తులమారి రాజకీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఏ ఉధ్యమం చేసినా... అది ప్రజాసేవ చేయాలనో, లేక పుట్టిన గడ్డకు ఏదో ఒకటి చేశామనే తృప్తి కోసమో చేస్తారే తప్ప... పబ్లిసిటీ కోసం కాదని శివాజీ పేర్కొన్నారు! తనపై వ్యక్తిగత విమర్శలు చేసేవారంతా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని తెలిపారు! గతంలో ప్రత్యేక ఆంధ్ర ఉధ్యమంలో పాల్గొన్న వెంకయ నాయుడు పబ్లిసిటీ కోసం చేశారా లేక ప్రాంతీయాభిమానంతో చేశారా అని నిలదీశారు! ఇదే సమయంలో వెంకయ్యను టార్గెట్ చేసిన ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని మాట ఇచ్చిన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మాట తప్పుతోందని శివాజీ నిలదీశారు. ఇటువంటి జిత్తులమారి రాజకీయాలు ఇంకెన్నాళ్లంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ గడ్డపై వున్న అనుబంధంతో దీక్ష చేపడితే, శివాజీ ప్రచారం కోసమే ఈ పనిచేస్తున్నారని ఆరోపించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించిన ఆయన... గతంలో వెంకయ్య నాయుడు పబ్లిసిటీ కోసమే జైఆంధ్ర ఉద్యమం చేశారా అని నిలదీశారు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి, కేంద్ర మంత్రిగా వున్న వెంకయ్య నాయుడు తాను వేసే పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు శివాజీ!
Tags:    

Similar News