వాడో స‌న్నాసి.. తిరుమ‌ల జోలికి వ‌స్తే న‌రికేస్తా?

Update: 2018-10-06 07:05 GMT
సాఫ్ట్ గా మాట్లాడే సినీ న‌టుడు క‌మ్ రాజ‌కీయ నాయ‌కుడు శివాజీ నోటి వెంట సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. ఆప‌రేష‌న్ గ‌రుడ అంటూ.. ఇటీవ‌ల కాలంలో మోడీ అండ్ కో ఏపీ విష‌యంలో ఇలా ప్లాన్ చేసిందంటూ ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్న శివాజీ తాజాగా ఊహించ‌ని రీతిలో హాట్ వ్యాఖ్య‌లు చేశారు. ఓప‌క్క రాఫెల్ గురించి దేశ వ్యాప్తంగా జ‌రుగుతుంటే ప‌ట్టించుకోని మోడీ.. టీటీడీలో కోట్లాది రూపాయిల అవినీతి జ‌రిగిన‌ట్లుగా సుబ్ర‌మ‌ణ్య స్వామి చెప్ప‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు.

వాడో స‌న్నాసి.. ఎవ‌డైనా స‌రే తిరుమ‌ల జోలికి వ‌స్తే న‌రికేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి సంచ‌ల‌నం సృష్టించారు. త్వ‌ర‌లో తాను ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం హోదా సైన్యాన్ని త‌యారు చేస్తున్న‌ట్లు చెప్పారు. న‌వంబ‌రు 2న ఈ సైన్యంతో ఏపీ రోడ్ల మీద ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

నాలుగు మాట‌లు మాట్లాడితే ప‌డిపోయే జీవీఎల్ ఆంధ్రా ప్ర‌జ‌ల మంచిత‌నం వ‌ల్లే రాష్ట్రంలో తిరుగుతున్నాడ‌ని.. జీవీఎల్ ఇదే రీతిలో తెలంగాణ‌లో మాట్లాడి తిర‌గ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు. పెను సంచ‌ల‌నంగా మారిన రాఫెల్ కుంభ‌కోణాన్ని దారి మ‌ళ్లించేందుకే ఐటీ దాడులు చేయిస్తున్నార‌న్నారు. 

మొన్న తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి.. తాజాగా ఏపీలో ఐటీ దాడుల వెనుక ఒక వ్య‌క్తి చ‌క్రం తిప్పిన‌ట్లుగా చెప్పారు. ఆ ఒక్క‌డే మొత్తం స‌మాచారాన్ని ఐటీ అధికారుల‌కు ఇచ్చిన‌ట్లు చెప్పారు. న‌లుగురు దుర్మార్గులు ఢిల్లీలో కూర్చొని ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తిరుమ‌ల‌తో పెట్టుకుంటే న‌రికేస్తానంటూ శివాజీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.
Tags:    

Similar News