మ‌ధ్య‌ప్ర‌దేశ్ ర‌చ్చ‌.. కాంగ్రెస్ కు క్లాస్ పీకిన శివ‌సేన‌!

Update: 2020-03-13 04:30 GMT
మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌యోగం విజ‌య‌వంతం అవుతున్న ద‌శ‌లో ఉంది. సింధియా, ఆయ‌న వెంట 22 మంది ఎమ్మెల్యేల ప‌య‌నం తో..అక్క‌డ ప్ర‌భుత్వం మైనారిటీలో ప‌డిపోయింది. ఈ క్ర‌మంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ త‌ర్వాత బీజేపీ నెక్ట్స్ టార్గెట్... మ‌హారాష్ట్ర‌నే అనే గుస‌గుస‌లూ మొద‌ల‌య్యాయి. మ‌హారాష్ట్ర‌లో క‌మ‌లం పార్టీ చాలా క‌సి మీదే ఉంది. అక్క‌డ త‌మతో క‌లిసి పోటీ చేసినే సేన, చివ‌ర‌కు వెళ్లి కాంగ్రెస్, ఎన్సీపీల‌తో చేతులు క‌ల‌ప‌డం తో బీజేపీకి ఆగ్ర‌హ‌మే క‌లిగింది. అప్ప‌ట్లోనే అందుకు సంబంధించి రియాక్ష‌న్ ఇచ్చింది. ఎన్సీపీని చీల్చినంత ప‌ని చేసింది. కానీ అప్ప‌ట్లో క‌మ‌లం ఆట సాగ‌లేదు.

కానీ మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌కీయం ఇచ్చిన ఉత్సాహం తో బీజేపీ మ‌హారాష్ట్ర మీద దృష్టి పెడుతుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో శివ‌సేన స్పందిస్తూ ఉంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భావం మ‌హారాష్ట్ర మీద ఉండ‌ద‌ని సేన వ్యాఖ్యానిస్తూ ఉంది. అలాగే కాంగ్రెస్ కు కూడా శివ‌సేన క్లాస్ పీకింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌డిపోతుండ‌టంలో బీజేపీ గొప్ప‌ద‌నం ఏమీ లేద‌ని సేన అంటోంది. కాంగ్రెస్ పార్టీ తీరు వ‌ల్ల‌నే అక్క‌డ ప్ర‌భుత్వం ప‌డిపోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని సేన చెబుతోంది. క‌మ‌ల్ నాథ్ నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే అక్క‌డ కాంగ్రెస్ దెబ్బ‌తింటోంద‌ని సేన అంటోంది.

అహంకారం, నిర్ల‌క్ష్య పూర్వ‌క‌మైన ధోర‌ణితో క‌మ‌ల్ నాథ్ వ్య‌వ‌హ‌రించార‌ని, అందుకే అక్క‌డ ప్ర‌భుత్వ మ‌నుగ‌డ సాగ‌లేద‌ని సేన అభిప్రాయ‌ప‌డింది. ఇలా త‌మ మిత్ర‌ప‌క్ష పార్టీకి క్లాస్ పీకింది సేన‌. జ్యోతిరాదిత్యం సింధియాతో కాంగ్రెస్ స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌న్న అభిప్రాయాన్ని ఇలా ఇన్ డైరెక్టుగా వ్య‌క్తం చేసింది శివ‌సేన‌.
Tags:    

Similar News