మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు వేళైంది. ఇప్పటికే మూడు సార్లు సీఎంగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి గెలుస్తాడా.? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే గడిచిన లోకల్ బాడీ ఎన్నికల్లో 14 మున్సిపాల్టీల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఈ ఏడాది జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. రైతులు కూడా అధికార బీజేపీపై అసంతృప్తితో ఉన్నారని వార్తలొస్తున్నాయి. కానీ స్టార్ క్యాంపెయినర్ శివరాజ్ సింగ్ మాత్రం నాలుగోసారి సీఎం అయ్యేందుకు పావులు కదుపుతున్నట్టు తాజా సమాచారం.
మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలుపుకు - కాంగ్రెస్ ఓటమికి మధ్య సీఎం శివరాజ్ సింగ్ ఉన్నారు. ఆయన ప్రజల్లో పిచ్చ ఫాలోయింగ్.. మంచి నేత అనే పేరుంది. అదే బీజేపీకి కొండంత బలం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని నెలల క్రితం జరిగిన సెంటర్ ఫర్ ది స్డీ ఆఫ్ డెవలప్ మెంట్ సర్వేలో కాంగ్రెసే గెలుస్తుందని రిపోర్టు వచ్చింది. కానీ అతి తక్కువ మెజార్టీతోనేని చెప్పింది. వ్యాపమ్ స్కామ్ కూడా బీజేపీ ఓటమికి కారణాలని విశ్లేషించింది.
అయితే కాంగ్రెస్ ను మధ్యప్రదేశ్ లో పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య.. నాయకత్వ లోపం. ఇప్పటికీ ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పలేని పరిస్థితి. గ్రూపు విభేదాల వల్ల కాంగ్రెస్ నిండా మునుగుతోంది. అదే సమయంలో బీజేపీకి శివరాజ్ సింగ్ కొండంత బలమవుతున్నారు. రెండు పార్టీల్లోని జాతీయ స్థాయి నేతలను పోల్చుకున్నా కూడా బీజేపీకే ఎక్కువమంది ఉండడం ఆ పార్టీకి కలిసివస్తోంది.
లెక్కల వారీగా చూస్తే బీజేపీ గడిచిన మూడు సార్వత్రిక ఎన్నికల్లో పురోగమిస్తూనే వచ్చింది. 2003లో 230 సీట్లకు గాను 173 సీట్లు సాధించగా.. 2008లో 143 సీట్లు మాత్రమే సాధించి వెనకబడింది. ఇక 2013లో మాత్రం బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఈసారి 165 సీట్లు సాధించి మూడోసారి అధికారం చేపట్టింది.
బీజేపీ మధ్యప్రదేశ్ లో గెలవడానికి ఐదు ప్రాంతాల్లో బలమైన పట్టు ఉండడమే కారణంగా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ ను వింధ్య ప్రదేశ్ - చంబర్ - మాల్వా నార్త్ - మహాకోషల్ - మాల్వా ట్రిబాల్ గా విభజిస్తారు. ఇందులో బీజేపీ మాల్వా ట్రైబల్(28 సీట్లు) - మాల్వా నార్త్(63 సీట్లు) లో బీజేపీకి గట్టి పట్టుంది. ఇక్కడ కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇక మహాకోషల్ (49 సీట్లు) ప్రాంతంలోనూ బీజేపీకి మంచి ఉంటుంది. కాంగ్రెస్ కు వింధ్య ప్రదేశ్ (56) - చంబల్ (34) సీట్లలో గట్టి పట్టుంది. ఈ లెక్కన చూసుకుంటూ బీజేపీకే ఒకింత పైచేయి అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక మధ్యప్రదేశ్ లో మాయవతి బీఎస్పీకి కూడా పట్టుంది. ఉత్తరప్రదేశ్ కు ఆనుకొని ఉన్న చంబల్ - వింధ్య ప్రదేశ్ లలో బీఎస్పీకి ఓటు బ్యాంకు ఉంది. కానీ గడిచిన మూడు ఎన్నికల్లో బీఎస్సీ ఈ రెండు ప్రాంతాల్లో కేవలం రెండు సీట్లలోనే గెలిచింది. కాంగ్రెస్ కు బాగా పట్టున్న ఈ రెండు ప్రాంతాల్లోనే బీఎస్పీకి అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉండడంతో కాంగ్రెస్ ఓటును బీఎస్పీ చీల్చుతుందని బీజేపీ భావిస్తోంది. ఇది బీజేపీ గెలుపుకు దోహదపడుతుందని అంచనావేస్తోంది. మరి మూడుసార్లు అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడి ప్రజా వ్యతిరేకతను తట్టుకొని గెలుస్తుందా.? శివరాజ్ సింగ్ క్లీన్ ఇమేజ్ పనిచేస్తుందా అన్నది వేచిచూడాల్సిందే..