షాక్‌: మూవీ టికెట్ తో యాక్సిడెంట్లు కంట్రోల్?

Update: 2019-10-30 06:32 GMT
ట్రాఫిక్ నిబంధ‌న‌ల్లో భాగంగా ప్ర‌భుత్వం ఎంత క‌ఠినంగా వ్య‌వ‌రించినా వాహ‌న చోద‌కులు మాత్రం మార‌లేదు. ఫైన్‌ క‌ట్టి రూల్స్  బ్రేక్ చేస్తున్నా... ఆ త‌ప్పు మాత్రం  మ‌ళ్లీ మ‌ళ్లీ పున‌రావృతం అవుతూనే ఉంది. ఆ విష‌యంలో ట్రాపిక్  పోలీసు అధికారులు ఎన్ని సెక్ష‌న్లు అమ‌ల్లోకి తీసుకొచ్చినా ఇండియాలో  ప‌ద్ద‌తి మాత్రం మార‌లేదు. అయితే హైద‌రాబాద్ లో మాత్రం సినిమా టికెట్ యాక్సిడెంట్ల‌ను అనూహ్యంగా త‌గ్గించింది. వాహ‌న చోద‌కుల్లో కొంత వ‌ర‌కూ మార్పు తీసుకొచ్చింది. అస‌లు సినిమా టిక్కెట్లు మార్పు తీసుకు రావ‌డం ఏమిటి అనుకుంటున్నారా? అయితే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ర‌హ‌దారుల‌పై వెళ్తోన్న ద్విచ‌క్ర వాహ‌న చోద‌కులు.. ఆటోలు.. కార్లు న‌డుపుతున్న డ్రైవ‌ర్లు యాక్సిడెంట్లు చేయ‌డ‌కుండా క్ర‌మ శిక్ష‌ణ అమ‌లు ప‌రిచేందుకు  ట్రాఫిక్ పోలీసులు సినిమా టికెట్లు  ఇవ్వాల‌ని  మూడు నెల‌ల క్రితం నిర్ణ‌యించారు. అప‌స‌వ్య దిశ‌(ఆపోజిట్)లో వెళ్ల‌కుండా.. ట్రాపిక్ సిగ్నెల్స్  దాట‌కుండా.. ర‌హ‌దారుల‌పై ఇష్టానుసారం వాహ‌నాల‌ను న‌డిపే వారిని గుర్తించి వారిని ప్రోత్స‌హించేకుందుకు  సినిమా టికెట్ల‌పై రాయితీని తీసుకొచ్చారు. ఒక్కొక్క‌రికి రెండు టికెట్లు చొప్పున ఇస్తున్నారు. నాలుగైదు నెల‌లుగా ఒక్క కేసు కూడా న‌మోదు కాని చోద‌కుల‌ను గుర్తించి సినిమా టిక్కెట్లు ఇవ్వ‌డంతో పాటు స‌త్క‌రిస్తున్నారు.

దీంతో వాహ‌న చోద‌కులు తాము నిబంధ‌న‌లు పాటిస్తున్నామ‌ని.. నాలుగైదు నెల‌లుగా ఒక్క జ‌రిమానా కూడా చెల్లించ‌లేద‌ని.. త‌మ‌కి టికెట్లు ఇవ్వాల‌ని పోలీసుల్ని కోరుతున్న‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో ఉన్న‌త స్థాయి పోలీసు అధికారులు సినిమా టిక్కెట్లు వాహ‌న చోద‌కుల్లో బాగానే మార్పు తీసుకొచ్చింద‌ని సంతోషం వ్య‌క్తం చేసారు. దీంతో ఈ న‌జ‌రానాను ఇలాగే కొన‌సాగించాల‌ని అధికారులు భావిస్తున్నారు. హ్యాట్సాఫ్ టు హైద‌రాబాద్ పోలీస్ క్రియేటివ్ ఐడియా..
Tags:    

Similar News