మాజీ మంత్రి.. ఈటెల రాజేందర్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి.. మరోసారి వివాదాస్పదమైంది. అసైన్డ్ భూముల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. ఆయనపై కొందరు రైతులు ఫిర్యాదు చేశారని పేర్కొంటూ.. హుటాహుటిన స్పందించిన కేసీఆర్ కు ఇప్పటికే.. హైకోర్టు ఒకసారి షాకి చ్చింది. కరోనా సమయంలో ఈ పనులేంటని.. నిలదీసింది. ప్రజలను రక్షించడం మానేసి.. ఈ విచారణలు చేయడం అవసరమా? అని ప్రశ్నించింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. అధికారులను ఎందుకు పంపించారంటూ.. వ్యాఖ్యానించింది. ఏదైనా సరే.. ``ఒక పద్ధతి`` ప్రకారం చేయాలని హైకోర్టు హితవు పలికింది.
దీంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. ఈటెలకు సంబంధించి భూముల్లో సెర్చ్ చేసిన విషయంలో కేసీఆర్‌కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దేవరయాంజల్ భూములకు సంబంధించి ఎప్పట్నుంచో ఉన్న వివాదంపై ఇప్పుడు తొందరెందుకని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజలు కరోనాతో మరణిస్తుంటే లేని స్పందన ఈ అంశంపై ఎందు కు? అని ప్రశ్నించింది. కరోనా విపత్తు వేళ నలుగురు ఐఏఎస్‌లతో విచారణ జరపాలా ? అని ధర్మాసనం అడిగింది. దీనిపై అడ్వొకేట్ జనరల్(ఏజీ) స్పందిస్తూ కేవలం ప్రాథమిక విచారణ కోసమే కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
కమిటీ నివేదిక ఇచ్చాకే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడే కూల్చివేతలు వంటి చర్యలు ఉండవని ఏజీ కోర్టుకు తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ప్రాథమిక విచారణకైనా నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు ఇవ్వాలని కమిటీకి ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కమిటీ విచారణకు సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వారి వివరణ తీసుకున్నాకే నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.