సీఎం జిల్లా లో ఎన్నికలు బహిష్కరణ!

Update: 2020-03-12 10:30 GMT
స్థానిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఉత్కంఠగా సాగుతున్నాయి. మొత్తం అధికార పార్టీ సొంతం చేసుకునేలా వాతావరణం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ఎన్నికలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్ కడపలో ప్రజలు షాకిచ్చారు. తమ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించవద్దని ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం కలకలం రేపుతోంది. తమ సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ గ్రామస్తులు ప్రకటించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అయితే సీఎం సొంత జిల్లాలో ఈ పరిణామం చోటుచేసుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. వారు ఎందుకు బహిష్కరించారంటే..

వైఎస్సార్ కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో గండికోట ప్రాజెక్ట్ ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ కింద ముంపునకు గురైన మూడు పంచాయతీలను వేరే పంచాయతీలను విలీనం చేశారు. అవి దత్తాపురం, బుక్కపట్నం, బొమ్మేపల్లి ఉన్నాయి. తమ పంచాయతీలను విలీనాన్ని ఆ గ్రామస్తులు వ్యతిరేకించారు. దీనిపై పలుసార్లు ఏకగ్రీవ తీర్మానం చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో తాము ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తమ సమస్యలను పరిష్కరించాలని, పునారావస చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ మేరకు నిరసన చేపట్టారు. అయితే దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టినట్టు సమాచారం. సీఎం సొంత జిల్లాలో ఎన్నికలు జరగకపోతే తీవ్ర విమర్శలు వస్తాయని భావించిన అధికార యంత్రాంగం వెంటనే గ్రామస్తులతో చర్చించి ఎన్నికలు జరిగేలా చూస్తున్నట్లు తెలుస్తోంది.



Tags:    

Similar News