కరోనా : ఐఐటీయన్ల ఉద్యోగ ఆఫర్లు అమెరికా తిరస్కరణ

Update: 2020-04-08 00:30 GMT
కరోనా ఎఫెక్ట్ మామూలుగా లేదు. అమెరికాలో విస్తృతంగా ప్రబలడంతో ఉద్యోగ, ఉపాధి రంగాలపై దాని ప్రభావం ప్రబలంగా ఉంది. చాలా కంపెనీలు మూతపడడంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్త ఉద్యోగాలన్నవే లేకుండా పోయాయి.

ఇక ఇదివరకూ ఇచ్చిన ఉద్యోగాలు, క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కూడా రద్దు కావడం విషాదం నింపింది. తాజాగా దేశవ్యాప్తంగా ఐఐటీలు, టాప్ మేనేజ్ మెంట్ క్యాంపస్ లలో ఆందోళన నెలకొంది. విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లు ఇచ్చిన అమెరికా కంపెనీలు ఈ ప్లేస్ మెంట్లనురద్దు చేయాలని నిర్ణయించాయి. దీంతో దేశ విద్యార్థులకు తీవ్రమైన షాక్ తగిలింది.

దేశంలోని 23 ఐఐటీల్లో డిసెంబర్-జనవరిలో జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో దాదాపు 8వేల మంది విద్యార్థులకు వివిధ దేశాల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి. ఇందులో అమెరికన్ కంపెనీలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అమెరికా కంపెనీలు ఈ ఉద్యోగ నియామకాలను రద్దు చేశాయి.

అయితే ఐఐటీ విద్యార్థులు, ఉద్యోగ ఆఫర్లు పొందిన వారు అమెరికా కంపెనీలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుత కరోనా సంక్షోభం పై ప్రపంచం ఆటుపోట్లను ఎదుర్కోంటోదని.. అమెరికన్ కంపెనీలు ఉద్యోగాలు రద్దు చేయవద్దని కోరుతున్నారు.   

ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఇచ్చిన ఉద్యోగ ఆఫర్లను ఉపసంహరించుకునే నిర్ణయంపై అమెరికన్ కంపెనీలు పునరాలోచనలో పడే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో మన విద్యార్థుల నోట్ల మన్ను పడినట్లే కనిపిస్తోంది.
Tags:    

Similar News