షాకింగ్ : చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలట ..!

Update: 2020-05-19 02:30 GMT
మహమ్మారి పాజిటివ్‌ కేసుల విషయంలో పొరుగుదేశం చైనా తప్పుడు లెక్కలు బట్టబయలు అయ్యాయి. చైనా ప్రస్తుతం చెబుతున్న గణాంకాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ కేసులు నమోదు అయ్యి ఉంటాయని ఓ నివేదిక తెలిపింది. తమ దేశంలో మహమ్మారిని చాలా సమర్థవంతంగా అదుపు చేశామని చైనా చెప్పుకుంటోంది. ఇండియా కూడా కరోనా కేసుల విషయంలో చైనాను దాటేసిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో  చైనా రక్షణ సాంకేతిక జాతీయ విశ్వవిద్యాలయం నుంచి ఓ నివేదిక లీక్‌ అ‍యినట్లు వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఫారిన్‌ పాలసీ మ్యాగజైన్‌ అండ్‌ 100 రిపోర్టర్స్‌ ఓ వార్తను ప్రచురించింది.  

చైనాలో ఇంతవరకూ 6.40 లక్షలకు పైగా  కేసులు నమోదయ్యాయన్నది ఈ నివేదికలోని ప్రధాన సారాంశం. దేశం వ్యాప్తంగా గల రెస్టారెంట్‌ లు, సూపర్‌ మార్కెట్లు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రిల్లో నమోదైన కేసులకు గల వివరాలను నివేదికలో పొందుపరిచినట్లు ఆ సంస్థ తెలిపింది. అలాగే మొత్తం 230 నగరాల్లో నమోదైన రికార్డలును పరిశీలించిన నివేదికను తయారు చేసినట్లు స్పష్టం చేసింది.

ఇక చైనా అధికారిక గణాంకాల ప్రకారం, ఇప్పటివరకూ 82 వేలకు పైగా కేసులు నమోదయ్యాయన్న సంగతి తెలిసిందే. అమెరికా సహా పలు దేశాలు కరోనా పాజిటివ్ కేసులపై చైనా తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక సంచలనం కలిగిస్తోంది. సమీప భవిష్యత్తులో చైనాలో మరోసారి  మహమ్మారి విజృంభిస్తుందంటూ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. మహమ్మారిని అదుపులోకి తెచ్చామని భావిస్తున్న చైనా, లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఐతే , అక్కడ కూడా గత వారం రోజులుగా మళ్లీ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు మహమ్మారి  పుట్టుక, వ్యాప్తిపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఆస్ట్రేలియా, యూరోపియన్‌ యూనియన్ తీర్మానం చేశాయి.
Tags:    

Similar News