ఒకే పార్టీకి చెందిన నేతల మధ్య అధిపత్య పోరు చివరకు పార్టీ పరువును బజారున పడేలా చేసింది. తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు ఇద్దరిమధ్య నెలకొన్న పంచాయితీ ముదిరి పాకాన పడటమే కాదు.. ఒక దశలో నువ్వెంత అంటే నువ్వెంత? అనే వరకు వెళ్లింది. దీంతో సదరు కార్యక్రమానికి వచ్చిన మంత్రి సైతం అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికి ఇరువురు నేతలు అస్సలు తగ్గలేదు.
ఇంతకూ జరిగిందేమంటే..
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య సంబంధాలు అంత సక్రమంగా లేవన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా తాండూరులో గ్రామ పంచాయితీలకు ఫాగింగ్ మెషీన్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి.. సురభి వాణీదేవిలు హాజరయ్యారు. అయితే.. వేదిక మీద ఎమ్మెల్సీ వర్గానికి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్.. కౌన్సిలర్లు ఉండగా.. ఎమ్మెల్యే వర్గానికి చెందిన సర్పంచ్ రాములు.. ఎంపీటీసీ సాయి రెడ్డితో పాటు.. టీఆర్ఎస్ పార్టీ పెద్దేముల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
మున్సిపల్ పరిధిలో జరుగుతున్న ప్రోగ్రాంకు ప్రోటోకాల్ ప్రకారం హాజరైతే అభ్యంతరం ఎందుకని మున్సిపల్ ఛైర్ పర్సన్ ప్రశ్నించారు. మాటా.. మాటా పెరిగి.. చివరకు ఒకరిని ఒకరు నెట్టుకునే వరకు వెళ్లింది. కాస్తంత తేడా వస్తే.. కొట్టేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేని రీతిగా పరిస్థితి మారింది. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు నువ్వెంత అంటే నువ్వెంత? అనుకునే వరకు వెళ్లింది.
ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. వారిద్దరిని సముదాయించేందుకు మంత్రి సబితా ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ గొడవ రాజకీయ సంచలనంగా మారింది. పార్టీ నేతలు ఇలా బహిరంగ వేదిక మీద కోట్లాడేసుకున్న తీరుతో పార్టీ కార్యకర్తలు విస్తుపోయారు. అధిపత్య పోరు ఉన్నప్పటికి.. హద్దులు దాటేసినట్లుగా వ్యవహరించిన వీరి తీరుపై అధినేత ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నదిప్పుడు చర్చగా మారింది.