ఉక్రెయిన్ విద్యార్థుల షాకింగ్ నిర్ణయం

Update: 2022-10-28 02:30 GMT
ఎరక్కపోయి ఆ దేశంలో చదువుకున్నారు. వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్ అయిపోదామని కలలుగన్నారు. కానీ సడెన్ గా వచ్చినపడిన ‘యుద్ధం’ వారి ఆశలను చిదిమేసింది.  ఉక్రెయిన్ లో చదివుతున్న భారత వైద్య విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది.  ఉక్రెయిన్ నుంచి భారత్ కు తిరిగివచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్ ఇప్పుడు అయోమయంలో పడింది.

నెలల తరబడి నిరీక్షిస్తున్నప్పటికీ  భారత్ ఎటువంటి పరిష్కారమార్గం చూపకపోవడంతో  విసుగు చెందిన వైద్య విద్యార్థులు తమ చదువులను కొనసాగించేందుకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తిరిగి ఉక్రెయిన్ కు పయనమయ్యారు. ఇండియాకు వస్తే వైద్య పట్టాతోనే వస్తాం..లేదంటే చావనైనా.. రేవైనా ఉక్రెయిన్లోనే అని తెగేసి చెప్పారు.

కాగా ఉక్రెయిన్ లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు దృష్ట్యా అక్కడ మిగిలి ఉన్న భారతీయులందరినీ దేశం విడిచి వెంటనే వెళ్లిపోవాలని అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. తర్వాత భారతీయ వైద్యవిద్యార్థులందరూ అక్కడికి వెళ్లడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఉక్రెయిన్ లో  ఆగిపోయిన చదువును భారత్ లోని వైద్య కళాశాల్లో మెడిసిన్ కంటిన్యూ అయ్యేలాగా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టులో వారంతా కేసులు వేశారు.  విద్యార్థుల కోరిక చిన్నదే అయినా ఇది అమలు చేయడం చాలా అసాధ్యం. వేల మందికి పట్టాలు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. వాళ్ల వైద్య విద్య పరిజ్ఞానం తెలుసుకోకుండా ఉక్రెయిన్ బాధితులంటూ మెడిసిన్ డిగ్రీ ఇవ్వడం దేశంలో కుదరదు.

భారత్ లో మెడిసిన్ పరీక్ష రాస్తే సీటు రాకపోవడంతోనే వీరంతా ఉక్రెయిన్ వెళ్లి డబ్బులు కట్టి చదువుతున్నారు. వీరిని ప్రైమేటు కాలేజీల్లో కూడా సర్దుబాటు చేయలేని పరిస్థితి. దీంతో కోర్టు విచారణ ఏ విధంగా చేస్తుందన్నది ఉత్కంఠగా మారింది.  వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ పై కేంద్రం చేతులెత్తేయడంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News