మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు దారుణ అనుభవం.. కారులోకి రా అంటూ ఈడ్చుకెళ్లాడు
ఈ ఉదంతం గురించిన తెలిసిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది? అన్న సందేహం కలుగక మానదు. దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన అంజలి ఉదంతం గురించి ఇంకా మర్చిపోక ముందే.. మరో మహిళ మీద ఆ తరహా ప్రయత్నం జరగటం.. సదరు మహిళ ఢిల్లీ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మాలీవాల్ కావటం సంచలనంగా మారింది. దేశ రాజధాని నగరంలో మహిళలకు ఉన్న రక్షణ ఎంత? అక్కడి పోలీసింగ్ మీద కొత్త సందేహాలు కలిగేలా తాజా ఉదంతం చోటు చేసుకుంది.
కొద్ది రోజుల క్రితం అంజలి అనే మహిళను ఢీ కొట్టి.. అదే పనిగా ఆమెను కొన్ని కిలోమీటర్లు ఈడ్చుకెళ్లటం ద్వారా.. ఆమెను దారుణంగా హతమార్చిన ఉదంతం తరహాలోనే ఈ ప్రముఖురాలి విషయంలో చోటుచేసుకోవటం గమనార్హం. అసలేమైందంటే?
రాత్రి వేళలో మహిళలకు ఉన్న రక్షణ ఎంతన్న విషయాన్ని పరిశీలన చేసేందుకు ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మాలివాల్ ఎయిమ్స్ గేట్ నెంబరు 2 వద్ద నిలుచొని ఉన్నారు. కోట్లా పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఉన్న ఆ ప్రాంతం ఫుట్ పాత్ మీద నిలుచున్న ఆమె వద్దకు ఒక కారు రావటం.. అందులో కారు నడుపుతున్న వ్యక్తి గ్లాస్ కిందకు దించి.. కారు లోపలకు రావాలని పదే పదే అన్నాడు. దీంతో చిర్రెత్తిన ఆమె.. కారు డోర్ లోపలకు చేయి పెట్టి అతడికి రెండు తగిలించే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో కారులో కూర్చున్న వ్యక్తి గ్లాస్ ఎత్తేయటంతో.. ఆమె చేయి అందులో ఇరుక్కుపోయింది. సదరు కారు డ్రైవర్ కారును దాదాపు 10 నుంచి 15 మీటర్ల వరకు లాక్కెళ్లాడు. ఆ సమయంలో ఆమె సిబ్బందితో ఉండటం. ఆమె పెద్ద ఎత్తున కేకలు వేయటంతో స్పందించిన సిబ్బంది ఆమెను కాపాడారు. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. ఒక రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు నేరుగా వేధింపులు ఎదురుకావటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
బుధవారం తెల్లవారుజామున 2.45 గంటలకు చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిసిన వెంటనే.. పోలీసులు స్పందించారు. తమకు ఫిర్యాదు 3.12 గంటలకు అందితే.. ఉదయం 3.20 గంటలకు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు హరీశ్ చంద్రగా గుర్తించారు. అతనుసంఘం విహార్ కు చెందిన వ్యక్తి అని.. బాగా తాగిన అతడు ఇలాంటి దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
మరోవైపు.. తనకు ఎదురైన భయానక అనుభవం గురించి రియాక్ట్ అయ్యారు స్వాతి మాలివాల్. తనను కారులో ఈడ్చుకెళుతున్నప్పుడు తాను గట్టిగా అరవటం.. ఆ వెంటనే తన సిబ్బంది స్పందించటంతో తనను వదిలేశాడని పేర్కొన్నారు. ఢిల్లీలో భద్రత ఎలా ఉందన్నది చూడాలని.. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కే భద్రత లేకుండా పోయిన వైనం తాజా ఉదంతంతో స్పష్టమవుతుంది.
ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. రెండు రోజుల్లో ఈ ఉదంతంపై పూర్తి నివేదికను ఇవ్వాలని పోలీసు వర్గాల్ని ఆదేశించింది. అంతేకాదు.. ఈ కేసును స్వయంగా కేసును పర్యవేక్షించి.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఏమైనా..ఒక ప్రముఖురాలి విషయంలో ఇలాంటి చేదు అనుభవం చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.