గచ్చిబౌలి జూనియర్ ఆర్టిస్టుల యాక్సిడెంట్ కు ముందు ఏం జరిగింది?

Update: 2021-12-19 00:30 GMT
వేగంగా దూసుకెళ్లిన కారు మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. హైదరాబాద్ లో ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో కారు ప్రమాదం విషాదం నింపింది. ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మరణించడం విషాదం నింపింది. వీళ్లలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉండడం ఇండస్ట్రీని కలవరపరిచింది.

హైదరాబాద్ గచ్చిబౌలిలోని హెచ్.సీయూలో ఈ దారుణమైన యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. డిసెంబర్ 18న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలో చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయపడిన వ్యక్తి పేరు సిద్ధు అని తెలుస్తోంది.ఇతడు కూడా జూనియర్ ఆర్టిస్టు కావడం గమనార్హం.

ఈ ప్రమాదంలో సిద్ధూ అనే మరో జూనియర్ ఆర్టిస్ట్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మద్యం మత్తులో వాహనాన్ని నడిపినందుకే ఈ ప్రమాదం జరిగినట్లు అతడు తెలిపినట్టు ప్రచారం సాగుతోంది. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్టు అతడు వివరించాడని ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి.

‘ఉదయాన్నే షూటింగ్ ఉందని జూనియర్ ఆర్టిస్టులు మా ఇంటికి వచ్చారని.. సిట్టింగ్ వేశామని.. ముగ్గురు మందు తాగారని.. నేనేం తాగలేదని’ సిద్ధూ చెప్పినట్టుగా మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది. అబ్దుల్ విస్కీ, జూనియర్ ఆర్టిస్టులు అమ్మాయిలిద్దరూ బీర్లు తాగారని’ సిద్ధూ తెలిపాడు. మందు తాగిన తర్వాత రాత్రి 1 గంటకు టీ తాగుదామని అన్నారని.. ఈ టైంలో డ్రంకెన్ డ్రైవ్ ఉంటుందని వద్దన్నా వినలేదని సిద్ధూ చెప్పాడు. ఇద్దరు అమ్మాయిలు వినకుండా కారులో బయలుదేరితే నేనూ తోడు వెళ్లానని వివరించాడు.

నాకు డ్రైవింగ్ రాకపోవడంతో అబ్దుల్ కారు నడిపాడని.. బాగా తాగి ఉండడంతో స్పీడులో ప్రమాదం జరిగిందని సిద్దూ తెలిపాడు. నేను మందు తాగలేదని.. ప్రమాదం నుంచి బయటపడ్డానన్నారు.

సిద్దూతోపాటు కారులో మరో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. చనిపోయిన వాళ్లలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. మానస(22), మానస(21) అనే మరో అమ్మాయి ప్రాణాలు కోల్పోయారు.  వాళ్లతోపాటు డ్రైవర్ అబ్దుల్లా కూడా మృతిచెందాడు.

ప్రస్తుతం తీవ్రగాయాలపాలైన సిద్ధూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








Full View
Tags:    

Similar News