భార్య కి కరోనా సోకిందని భర్త ఏంచేశాడంటే ?

Update: 2021-06-04 11:30 GMT
కరోనా వైరస్ సెకండ్ వేవ్ జోరు కొనసాగుతూనే ఉంది. గతంలో కంటే ప్రస్తుతం కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు అయితే తగ్గుతున్నాయి. కానీ, కరోనా మాత్రం ఇంకా అదుపులోకి రావడంలేదు. దేశంలో ఓ వైపు భారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. అలాగే వ్యాక్సిన్ కొరత కూడా తీవ్రంగా ఉండటంతో పలు విదేశీ వ్యాక్సిన్ల కి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇదిలా ఉంటె .. కరోనా మహమ్మారి మనుషుల్లో ఉండే మానవత్వాన్ని పూర్తిగా తొలగించింది. పక్కనున్న వారికి కాదు కదా , సొంత ఇంట్లో , కుటుంబ సభ్యులకి కరోనా సోకినా కూడా వారి వైపు చూడటం కూడా మానేస్తున్నారు. విపత్కర సమయంలో దైర్యం చెప్పాల్సింది పోయి , వారిని మరింత క్షోభ కి గురి చేస్తున్నారు. కరోనా సోకిన తల్లిదండ్రులని రోడ్డు మీద , హోస్పిటల్ లో వదిలేసి వెళ్లిన సంఘటనలు ఎన్నో జరిగాయి.

తాజాగా మంచిర్యాల జిల్లాలో కూడా ఈ తరహా ఘటనే జరిగింది.  కరోనా సోకిన భార్యను భర్త బాత్ రూమ్ లో ఉంచాడు. ఇంట్లోని మరుగుదొడ్డిని కూడా వాడకూడదని రూల్ కూడా  పెట్టాడు. లక్సెట్టిపేట గోదావరి రోడ్, గోపాలవాడలో భార్య భర్తలు మేడి నర్సమ్మ, పెద్దయ్య నివాసం ఉంటున్నారు. నర్సమ్మకు ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంట్లో సరిపడా గదులు ఉన్నా.. పెద్దయ్య ఆమెను బాత్ రూమ్ లో ఉంచాడు. బయట ఓ గొయ్యి తీసి అక్కడే కాలకృత్యాలు తీర్చుకోవాలని తెలిపాడు. అయితే ఆ గోతి నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దయ్య ఇంటికి వచ్చిన పోలీసులు నర్సమ్మను ఐసోలేషన్ సెంటర్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే నర్సమ్మ అందుకు ఒప్పుకోలేదు. ఇక్కడే ఉంటానని మొండికేసి కూర్చుంది. దీంతో పోలీసులు పెద్దయ్యను ఒప్పించి ఇంట్లో ఓ గదిని వాడుకునేలా అనుమతి ఇచ్చారు.
Tags:    

Similar News