ఆరాచక నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బిహార్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో నిలుస్తుంటుంది దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్. తాజాగా ఆ రాష్ట్రంలో దారుణ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఒళ్లు గగుర్పాటుకు గురి కాక తప్పదు. ఆ రాష్ట్రంలోని నేరస్తులు ఎంతకైనా తెగిస్తారన్న వైనం ఈ దారుణ ఘటనను చూస్తే అర్థమవుతుంది.
బరేలీకి చెందిన 19 ఏళ్ల యువతి ఇద్దరు స్నేహితులతో కలిసి స్కూటీ మీద బయటకు వెళ్లింది. వారిని దారి మధ్యలో ఒకడు అడ్డగించాడు. అనంతరం తన ఆరుగురు స్నేహితుల్ని అక్కడకు పిలపించాడు. వారంతా వచ్చి బాధిత యువతితో పాటు ఉన్న ఇద్దరు అబ్బాయిల్ని తరిమేశారు. అనంతరం ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని వీడియో తీశారు. ఆమెను కొట్టి.. ఆమె వద్ద ఉన్న డబ్బు తీసుకొని పరారయ్యారు.
జరిగిన దారుణ ఘటన గురించి ఇంట్లో వారికి బాధిత యువతి చెప్పలేదు. తన సోదరికి జరిగింది చెప్పగా.. నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితుల్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఇద్దరు నిందితులు పోలీసులపైకి కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
దీంతో.. పోలీసులు స్పందించి తిరిగి కాల్పులు జరపటంతో ఒకరికి గాయమైంది. దీంతో.. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని 22 ఏళ్ల విశాల్ పటేల్.. 23 ఏళ్ల అనుజ్ పటేల్ గా గురతించారు. వారి నుంచి మిగిలిన నిందితుల వివరాల్ని సేకరించారు. పరారీలో ఉన్న నలుగురు నిందితుల్నిత్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు యూపీలో సంచలనంగా మారింది. తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.