వందేళ్లకు పైనే బానిసలు ఉండేవారు. మనుషుల్ని బానిసలుగా చేసి.. వారిని వస్తువుల మాదిరి అమ్మేస్తూ రాక్షసంగా వ్యవహరించేవారు. చరిత్ర పుస్తకాల్లో ఇలాంటివి చదివినప్పుడు మనిషి పరిణామక్రమంలో ఎన్ని దారుణాలు.. దురాగతాలు చోటు చేసుకున్నాయన్నది తలుచుకుంటే ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా ఉంటుంది.
అలాంటిది ఇప్పుడున్న డిజటల్ యుగంలో మహిళను ఒక వస్తువు కంటే హీనంగా.. ఒకరి తర్వాత మరొకరు అమ్మేసుకుంటూ.. తమ లైంగిక సరదాలు తీర్చుకుంటూ.. పిల్లల్ని కనే యంత్రంగా చేయటమే కాదు.. ఆమెను గొలుసులతో ఒక పూరి గుడిసెలో ఉంచిన వైనం తాజాగా బయటకు రావటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అందరూ విస్తుపోయేలా చేస్తోంది. ఈ దారుణం గురించి విన్నంతనే.. మరీ ఇంత ఆరాచకమా? అన్న భావన కలుగక మానదు.
తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రివిన్సులో ఒక మహిళను గొలుసులతో కట్టి.. బంధించిన వైనానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో రావటం.. అది కాస్తా వైరల్ గా మారటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చైనాలో సాగుతున్న అక్రమ రవాణాపై పెద్ద ఎత్తున చర్చ జరిగేలా మారింది. దీనికి సంబంధించి చైనా ప్రభుత్వం చర్యలు తీసుకున్నా.. అదంతా నష్ట నివారణలో భాగమనే చెప్పాలి తప్పించి.. మరింకేమీ కాదు. అదే సమయంలో.. చైనాలో మనుషుల అక్రమ రవాణా ఏ స్థాయిలో ఉందన్న విషయం తాజా ఉదంతంతో అర్థమయ్యే పరిస్థితి.
యూనాన్ కు చెందిన ఒక మహిళ 1977లో జన్మించింది. దాదాపు 28 ఏళ్ల వయసులో ఆమెకు (1995లో) పెళ్లైంది. రెండేళ్లకే అంటే.. 1997లో విడాకులు తీసుకొని యాగు గ్రామానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత నుంచి ఆ మహిళకు జీవితంలో ఎదురైన కష్టాలు అన్ని ఇన్ని కావు.
సాంగ్ అనే మహిళ ఆమెకు మాయమాటలు చెప్పి ఆమె ఊరికి 2 వేల కిలో మీటర్ల దూరంలో ఉన్న జియాంగ్సు ప్రావిన్సుకు తీసుకొచ్చింది.

అక్కడ ఒక వ్యక్తికి అమ్మేసింది. కొన్ని నెలల తర్వాత అతను ఒక హోటల్ నడుపుకునే దంపతులకు ఆమెను అమ్మగా.. వారు ఆ తర్వాత నిర్మాణ రంగానికి చెందిన వ్యక్తికి పెళ్లి కుమార్తెగా అమ్మేశారు. అతను ఆమెతో కొంతకాలం ఉండి ఆ తర్వాత ఫెంగ్ కౌంటీకి చెందిన వ్యక్తికి అమ్మేశాడు. అతడి నుంచి డాంగ్ అనే ఇంటి పేరున్న వ్యక్తి ఆమెను పెళ్లి పేరుతో కొనుక్కున్నాడు.
మొత్తంగా 1999 నుంచి 2020 వరకు ఏడుగురు ఆమెను కొనుక్కోగా.. వారి లైంగిక చర్యల కారణంగా ఏడుగురు మగ పిల్లలతో సహా మొత్తం ఎనిమిది పిల్లలకు తలైంది. తాజాగా ఒక పూరి గుడిసెలో గొలుసులతో కట్టి బంధీగా ఉంది. మరొకరికి ఆమెను అమ్మేందుకు సిద్ధంగా ఉన్న వేళలో.. ఆమెకు సంబంధించిన వీడియో బయటకు రావటం.. అది కాస్తా పెను సంచలనంగా మారింది. ఈ వీడియోతో తమకు జరిగిన ఇమేజ్ డ్యామేజ్ ను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉంది.