షాకింగ్ న్యూస్ : 13 మంది కేబినెట్ మంత్రులకి పాజిటివ్ !

Update: 2020-09-25 08:10 GMT
మహారాష్ట్ర .. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా కరోనా వ్యాప్తి జరుగుతున్న రాష్ట్రం. అలాగే దేశంలో ఎక్కువ కేసులు కూడా ఈ మహారాష్ట్రలోని నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 12,82,963 మందికి కరోనా సోకగా.. 34,345 మంది మరణించారు. దేశంలో అలాగే , రాష్ట్రంలో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో ఉండటంతో అందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీచేస్తూనే ఉంది. ఇక ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ 'మహా' మంత్రులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయ్యారు. దీనితో ఏకంగా 13 మంది మంత్రులకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.  

ముఖ్యమంత్రి సహా మహారాష్ట్రలో మొత్తం 43మంది మంత్రులున్నారు. వారిలో ఏకంగా 13మంది ఒకేసారి కొవిడ్ బారిన పడ్డారు. ముందుగా మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఏకనాథ్ షిండే తనకు కరోనా సోకింది.  తనతో ఎవరైతే సన్నిహితంగా మెలిగారో… వారంతా టెస్ట్ చేయించుకోవాలని కోరారు. షిండే ఈ వారం మొదట్లో కేబినెట్ మీటింగ్ కి హాజరయ్యారు. షిండేతో కలిపి మొత్తం 13 మంది మహారాష్ట్ర మంత్రులు కోవిడ్ బారిన పడ్డారు.ఈ సమావేశానికి హాజరైనవారంతా ఏక్ నాథ్ షిండే తో సన్నిహితంగా ఉన్నవారే. దీనితో అందరూ కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోగా ..  అందులో 12మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీనితో ఏక్ నాథ్ తో కలిపి మొత్తం మహారాష్ట్ర కేబినెట్ లో 13మంది కరోనా బారిన పడ్డారు. దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రంలో ఇప్పటివరకు  ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు కరోనా బారిన పడ్డా.. ఈ స్థాయిలో ఒకే రాష్ట్రంలో ఒకే సారి ఇంతమందికి వ్యాధి సోకలేదు. దీనికి ప్రధాన కారణం ఆ మంత్రుల నిర్లక్ష్యమేనని అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News