ఆడవాళ్ల నడకపై ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 50 ఏళ్లు నిండేనాటికి ఆడవాళ్లు 64,373 కిలోమీటర్లు నడుస్తారని ఈ సర్వేలో తేలింది. సాధారణంగా ఆడవాళ్లు , ఇంటి పని, వంట పనిలో ఎప్పుడూ బిజీగా ఉంటారు. అంతేకాక షాపింగ్‌లకు వెళ్లడం, పిల్లలను స్కూళ్లకు పంపించడం వంటి పనులు కూడా చేస్తుంటారు. అయితే ఆడవాళ్లు ప్రతిరోజు ఎంతదూరం నడుస్తారనే విషయంపై శాస్త్రవేత్తలు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి.
ఆడవాళ్లు వారానికి 51,330 అడుగులు నడుస్తారంట. అంటే 24 మైళ్లు. కిలోమీటర్లలో చెప్పాలంటే 38. అంటే ఈ లెక్కన 50 ఏళ్లు వచ్చేనాటికి 64,373 కిలోమీటర్లు నడుస్తారట. 18 నుంచి 50 ఏళ్లవరకు యేడాదికి 26,69,190 అడుగులు, 2032 కిలోమీటర్లు. అంటే యేడాదికి రెండేవేల కిలోమీటర్ల దూరంమేర నడక? హైదరాబాద్ నుంచి కాశ్మీర్ కు దూరం ఎంతనుకున్నారు? 1,832కిలోమీటర్లు. అంటే యేడాదికి అంత దూరం ఆడవాళ్లు నడుస్తున్నారా? ఈ స్టడీలోని మహిళ్లలో 70శాతం పనిచేస్తున్నారు. వాళ్లు రోజుకు 7 గంటలు నడుస్తూనే ఉంటారంట.
అంటే ఇంటిదగ్గర పనులు, ఆఫీసులోనూ నిలువకాళ్లమీదనే ఉంటారంట. యేడాదిలో రోజుల బట్టి లెక్కవేస్తే, నిల్చొనే 7రోజుల పాటు వంటచేస్తారు. 5రోజులు ఎక్స్‌ర్‌సైజులు పిల్లలతో ఆటలు, క్లీనింగ్, ఫ్రెండ్స్ ఇంటికెళ్లడం… ఇలాంటి వ్యాపకాలతో నడుస్తూనే ఎక్కువుగా నిల్చొనే ఉంటారు. సర్వేలో మరో విషయం కూడా బయటపడింది. అదేమిటంటే మహిళలు తమ జీవితకాలంలో 7 చోట్ల ఉద్యోగాలు మారుస్తారట. అయితే తాము ఇంత దూరం నడుస్తామన్న సంగతి ఆడవాళ్లకు తెలియదట. నిజానికి ఆడవాళ్లు ఉద్యోగాలు చేసినా వాళ్లకు ఇంటి పని తప్పడం లేదు. మన దేశంలో అయితే చాలామంది మహిళా ఉద్యోగులు ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఇంటి పనికూడా చేస్తుంటారు. మహిళలు మాత్రం, ఉన్న ప్రతి ఉద్యోగ అవకాశాలను వాడుకొంటూనే అన్ని బాధ్యతలను నెలవేర్చడంటే ఇన్స్పిరేషనే కదా అంటారు సైకాలజిస్ట్‌లు. ఓ వైపు ఇంటి పని, ఆఫీసు పని చేస్తూ నెట్టుకొస్తున్న మహిళలు ఇన్ని వేల కిలోమీటర్లు నడుస్తున్నారట.