షాకింగ్ వీడియో: గన్ తో బెదిరించి అమెరికాలో భారతీయుడి దోపిడీ

Update: 2022-06-14 07:31 GMT
గత వారం  న్యూయార్క్‌లోని భారతీయ అమెరికన్‌కు చెందిన నగల దుకాణాన్ని దొంగల ముఠా దోచుకున్న సంఘటన ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.. ఇప్పుడు ఓ భారతీయ అమెరికన్‌ను పట్టపగలు తుపాకీతో బెదిరించి దోచుకున్నారు. ఈ సంఘటన షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.

ఈ ఘటన కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో చోటుచేసుకుంది. బాధితుడి భార్యకు చెందిన కారు డాష్‌క్యామ్‌లో చిత్రీకరించిన వీడియోలో ఇదంతా రికార్డ్ అయ్యింది.భారతీయ అమెరికన్ ని తుపాకీతో బెదిరించి కొందరు దుండగులు దోచుకోవడం చూడవచ్చు. భారతీయ అమెరికన్ అయిన బాధితుడు ఈ దోపిడీపై వివరించాడు.  భారతీయ అమెరికన్ మరియు అతని కొడుకును ఐదారుగురు దొంగలు ప్రవేశించి కట్టిపడేసి బందీలుగా ఉంచారు.

అనంతరం  వారు ఇంటిని దోచుకున్నారు. డెబిట్ కార్డ్ నుండి రోజువారీ లావాదేవీల పరిమితిని ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు.  బ్యాంకు నుండి మరింత నగదును విత్‌డ్రా చేయడానికి బాధితుడిని బలవంతం చేయడానికి ప్రయత్నించారు. తన కొడుకును ఇంట్లో బందీగా ఉంచి బ్యాంకుకు తీసుకెళ్లారు.  బ్యాంక్ మూసివేయబడినందున ప్రయత్నం విజయవంతం కాలేదు.
 
దుండగులు పక్క కంచె ఎక్కి ఇంట్లోకి ప్రవేశించేందుకు డాబాలోని కిటికీ తెరిచినట్లు బాధితురాలు తెలిపింది.  "మా గ్యారేజీలో దొంగలు కారులో బయలుదేరే ముందు నా భార్య మమ్మల్ని రక్షించే ఏకైక పాయింట్ వద్దకు వచ్చింది. గ్యారేజ్ తలుపు తెరవగానే, నా భార్య అనుమానాస్పద కారును గమనించి వెంటనే పోలీసులకు 911కి కాల్ చేసింది. ఇది జరుగుతున్నప్పుడు దొంగలు నన్ను బలవంతంగా బెదిరిస్తున్నారు. అరవవద్దని ఇంట్లోకి పొమ్మని ఆదేశించారు. కానీ నా భార్య విపరీతంగా హారన్ చేస్తూనే ఉంది. అప్పుడు వారు నన్ను తుపాకీ చూపిస్తూ బెదిరించడానికి ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ/పోలీసు కార్ల సైరన్‌లు వినిపించాయి.  అది వారిని భయపెట్టింది. వారు వెంటనే తమ వాహనంలో బయలుదేరారు. 2 గంటల పాటు దొంగలు ఆ ఇంట్లో దోపిడీ చేశారు.

ఈ  సంఘటనతో తమకు తీవ్ర మానసిక క్షోభ కలిగిందని భారతీయ అమెరికన్ కుటుంబం వాపోయింది.  మాకు భౌతికంగా ఎటువంటి హాని జరగలేదని తెలిపారు. పోలీసులు ఆ దొంగలను పట్టుకోలేకపోయారు. దొంగలు తస్కరించిన వాటి సాక్ష్యాలను సేకరించారు. ఇంట్లోని  కెమెరాలు ఈ వీడియోల సమూహాన్ని రికార్డ్ చేశాయి, కానీ దొంగలు అందరూ ముసుగులు ధరించారు. దీంతో ఎవరు చేశారన్నది బయటపడలేదు.

Full View

Tags:    

Similar News