అంతరిక్షం లో సినిమా షూట్ .. 'అమెరికా'కి రష్యా మార్క్ దెబ్బ

Update: 2021-05-17 04:22 GMT
అంతరిక్షంలో సినిమా .. ఏదేమైనా పెద్ద వింతా , ఇప్పటికే ఎన్నో సినిమాలు అంతరిక్షం లో తెరకెక్కాయి. మేము  చూశాము అని అనుకుంటే పొరపాటే , ఇప్పటి వరకు అంతరిక్షం కథలతో పలు సినిమాలు తెరకెక్కినా కూడా, వాస్తవానికి సెట్టింగ్స్ వేసి చిత్రీకరణ జరుపుతారు. దానికి మరింత గ్రాఫిక్స్ జోడించి మనకు అంతరిక్షంలో ఉన్న భావన కలిగిస్తారు. అంతే తప్ప అంతరిక్షం నేపథ్యంలో సినిమా అంటే అంతరిక్షానికి వెళ్లడం జరగదు. అయితే, త్వరలో తెరకెక్కున్న ఈ సినిమా మాత్రం.. నిజంగానే అంతరిక్షంలో షూటింగ్ జరుపుకోబోతోంది. యాక్షన్, థ్రిల్లర్లకు పెట్టింది పేరైన ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్‌ క్రూజ్ ఈ సాహసానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పూర్తి అయితే ,ప్రపంచంలోని తొలిసారి అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్న చిత్రంగా రేర్ రికార్డ్ సృష్టిస్తుంది.

ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్‌ లో ఈ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌నున్న‌ది. ఈ సినిమా షూటింగ్ కోసం ర‌ష్యాకు చెందిన రాస్‌ కాస్మోస్ అంత‌రిక్ష ఏజెన్సీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. న‌లుగురు నాన్ ప్రొఫెష‌న‌ల్ న‌టుల్ని, అంత‌రిక్ష సిబ్బందిగా స్పేస్ స్టేష‌న్‌ కు తీసుకువెళ్ల‌నున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ 5వ తేదీన ఎగ‌ర‌నున్న సోయేజ్ ఎంఎస్‌-19 వ్యోమ‌నౌక ద్వారా ఆ న‌టులు అంత‌రిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. భూమికి సుమారు 350 కిలోమీట‌ర్ల ఎత్తులో స్పేస్ స్టేష‌న్ సంచ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ సినిమాకు ఛాలెంజ్ అనే టైటిల్‌ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో న‌టించే యాక్ట‌ర్లు ముందుగా జీరో గ్రావిటీ ప‌రీక్ష‌లు క్లియ‌ర్ చేయాల్సి ఉంటుంది. పారాచ్యూట్ శిక్ష‌ణ కూడా పొందాల్సి ఉంటుంది. ఈ నెల చివ‌ర‌లోగా ఆ న‌టులు త‌మ శిక్ష‌ణ స్టార్ట్ చేయ‌నున్నారు. ర‌ష్యాకు చెందిన 36 ఏళ్ల న‌టుడు యులియా పెరిసిల్డ్‌, 37 ఏళ్ల క్లిమ్ షిపెంకో ప్ర‌ధాన సిబ్బందిలో ఉంటారు. 33 ఏళ్ల న‌టుడు అలెనా మోర్డ‌వినో, కెమెరా డైర‌క్ట‌ర్ అలెక్సీ డుడిన్‌లు కూడా రిజ‌ర్వ్ క్రూగా వెళ్తారు.

రష్యాలోనే అతిపెద్ద స్టూడియో ‘యెల్లో, బ్లాక్ అండ్ వైట్ స్టూడియో’ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారమ. ఈ నేపథ్యంలో నాసా, స్పెస్ ఎక్స్ ఈ సినిమాను తీస్తాయా, లేదా రష్యా ముందుగా ఈ ప్రాజెక్టును సొంతం చేసుకోనుందా అనేది సస్పెన్స్‌ గా మారింది. ఈ ప్రాజెక్టును ఎవరు దక్కించుకున్నా.. షూటింగ్ జరిగేది మాత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోనే. చిత్రయూనిట్ స్పష్టమైన ప్రకటన చేస్తేగానీ దీనిపై స్పష్టత రాదు. ఏడాది క్రితమే టామ్‌ క్రూజ్‌ ప్రధాన పాత్రలో ఒక సినిమాను అంతరిక్షంలో చిత్రీకరించబోతున్నట్టు నాసా  ప్రకటించింది,కానీ అది కార్యరూపం దాల్చలేదు.  హాలీవుడ్‌లో ‘జేమ్స్‌బాండ్’ సినిమా తర్వాత అత్యంత ప్రజాధారణ పొందిన ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రాలతో టామ్‌క్రూజ్ తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్నాడు. ఇందులో అతడు చేసే స్టంట్లు ఒళ్లుగగుర్పాటుకు గురిచేస్తాయి.  ప్రమాదకరమైన స్టంట్లన్నీ టామ్ స్వయంగా చేస్తాడు.
Tags:    

Similar News