గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో నానుతున్నా వేములవాడ ఎమ్మెల్యే పౌరసత్వం కేసు కొలిక్కి రానుందా..? ఇంతకాలం రెండు దేశాల పౌరసత్వాలు కలిగి ఉన్నారన్న రమేశ్ బాబు కేసు తీర్పు త్వరలో వెలువడనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత కోర్టు 24న పూర్తి విచారణను చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో 24న ఎమ్మెల్యే రమేశ్ బాబు పౌరసత్వంపై తీర్పు వెలుడనున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. మరోవైపై హైకోర్టు ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొనడంతో ఎమ్మెల్యే పౌరసత్వంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వంతో గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో కేసు నడుస్తోంది. ఆయన 2019 లో బెర్లిన్‌లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ తీసుకున్నారని మరియు OCI కార్డ్ కోసం తన దరఖాస్తులో జర్మనీగా పేర్కొన్నాడని ఆయనపై ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్ తరపున న్యాయవాది రవికిరణ్ రావు కోర్టులో తెలిపాడు.
అలాగే ఎమ్మెల్యే OCI కార్డుపై భారతదేశానికి వచ్చారని, జర్మన్ పాస్‌పోర్ట్‌తో జర్మనీ వెళ్లొస్తున్నారని అన్నారు. 2009 లో భారతీయ పౌరసత్వం పొందినప్పుడు, 2013 వరకు చెల్లుబాటు అయ్యే జర్మన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నాడన్నారు. ఓ వైపు భారతీయుడినని చెప్పుకుంటూనే 2023 వరకు జర్మన్ పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించాడని, అయితే భారతీయ పాస్‌పోర్ట్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.
ఇదిలా ఉండగా చెన్నమనేని తరఫు న్యాయవాది వాదిస్తూ చెన్నమనేని రమేశ్ బాబు పాస్‌పోర్ట్ పూర్తిగా ప్రయాణం కోసమే తీసుకున్నారన్నారు. అయన ప్రయాణానికి పౌరసత్వంతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. పౌరసత్వ చట్టం, 1955 లోని సెక్షన్ 10 (3) ప్రకారం, వ్యక్తి భారతదేశ పౌరుడిగా కొనసాగితే ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా లేదని ప్రభుత్వం సంతృప్తి చెందితే తప్ప, ఏ వ్యక్తి పౌరసత్వాన్ని కోల్పోలేరని ఆయన వాదించారు.చెన్నమనేనికి నేర నేపథ్యం లేదని, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయలేదని ఆయన అన్నారు. అతను తీవ్రవాదం, గూఢచర్యం, తీవ్రమైన వ్యవస్థీకృత నేరం లేదా యుద్ధ నేరాలలో ఏ విధమైన ప్రమేయం కలిగి లేడని పేర్కొన్నాడు. అందువల్ల కేంద్రం అతని పౌరసత్వం రద్దు చేయొద్దని అన్నారు.
ఇరువాదలను విన్న కోర్టు చెన్నమనేని న్యాయవాదిని OCI కార్డులో జర్మనీగా ఎందుకు పేర్కొనారని ప్రశ్నించింది. అలాగే ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 24నకు వాయిదా వేసింది. ఈవాదనలో ప్రభుత్వం తరుపున అస్పిటెంట్ సోలిసిటర్ జనర్ రాజేశ్వర్ రావు హాజరయ్యారు. పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరుపున రవికిరణ్ రావు వాదించారు. మొత్తం సారాంశాన్ని బుక్ లెట్ రూపంలో కోర్టుకు నివేదిక సమర్పించారు.
ఈ సందర్భంగా కోర్టు ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొనడంతో నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పిటిషనర్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అయితే గతంలో చెన్నమనేని పౌరసత్వం రద్దయితే రెండో స్థానంలో ఉన్న వారిని ఎన్నుకునే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ కోర్టు మరోసారి ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో వేములవాడలో మరోసారి ఉప ఎన్నిక జరగనుందా..? అని చర్చించుకుంటున్నారు.