మన చుట్టూ ఉన్నట్లే ఉంటారు కానీ భావజాలం విషయంలోనూ.. కొన్ని విషయాల్లో స్పందించే తీరు చూస్తే షాక్ తినేలా చేస్తుంది. చుట్టూ ఉన్న వారి మీద కొత్త సందేహాలు పుట్టుకొచ్చేలా చేస్తాయి. తాజాగా బాలీవుడ్ నిర్మాత ఒకరు చేసిన వ్యాఖ్యలు వింటే ఆవేశం పొంగుకు రావటమే కాదు.. ఇంత నీచాతినీచంగా ఆలోచించటం.. సలహాలు ఇవ్వటం అతనికి మాత్రమే సాధ్యమవుతుందేమో? అన్న భావన కలగటం ఖాయం.
దిశ హత్యాచార ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారి.. పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ.. మహిళల రక్షణ మీద తీసుకోవాల్సిన చర్యలు ఏమిటన్న విషయంపై సలహాలు ఇవ్వాల్సింది పోయి.. దరిద్రపుగొట్టు సలహాలు ఇచ్చే డానియల్ శ్రావణ్ లాంటోడ్ని ఏం చేయాలన్న సందేహం కలుగుతుంది.
ఇతగాడు తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారటమే కాదు.. ఇలాంటోడ్ని ఏం చేస్తే బాగుంటుందన్న క్వశ్చన్ మదిలో మెదలటం ఖాయం. ఇంతకూ ఇతగాడు ఏమన్నాడంటే.. ఎవరైనా ఒక మహిళను రేప్ చేయబోతే.. సదరు మహిళ తన బ్యాగ్ లో నుంచి కండోమ్ ఇచ్చి వారి లైంగిక వాంఛ తీర్చాలంటూ సలహా ఇచ్చాడు. తాను ఇచ్చిన సలహాతో హింస లేకుండా బాధితులు బయటపడొచ్చన్నది తన అభిప్రాయంగా వెల్లడించాడు.
స్త్రీ ఏమైనా మెషీనా? దారిన పోయేటోడు మనసు పడితే చేతిలో కండోమ్ పెట్టి నీ ఇష్టమనటానికి? అన్న ప్రశ్నతో పాటు.. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలతో ఉన్న అతగాడి బుర్రకు ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందన్న భావన కలగటం ఖాయం. రేప్ జరగకుండా ఉండాలంటే మహిళలు ఏమేం చేయొచ్చో తన సోషల్ మీడియా ఖాతాలో పిచ్చ రాతలు రాసుకొచ్చాడు.
వాటిల్లో కొన్నింటిని చూస్తే.. అత్యాచారం కేసుల్లో విదిస్తున్న కఠిన శిక్షలే బాధితుల్ని రేపిస్టులు చంపేయటానికి కారణమని.. 18 ఏళ్లు పైబడిన ఆడపిల్లలు మగాళ్ల లైంగిక వాంఛను రిజెక్ట్ చేయకుండా అవగాహన కల్పించాలంటూ చెత్త రాతలతో తన పోస్టును నింపేశాడు. ఇంత పైత్యం ఉన్న ఇతగాడిలాంటోళ్లకు అవకాశం ఇవ్వాలే కానీ.. రేప్ ను చట్టబద్ధం చేయాలని.. మగాళ్లకు జన్మహక్కుగా వాదించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముందు ఇలాంటి వారిపై చట్టం చర్యలు చేపడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.