ఆయన నారా లోకేష్ కి తోడల్లుడు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడు. ఒక తాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా రెండు సార్లు చేసి ఎమ్మెల్సీగా ఉంటూ ఉత్తరాంధ్రా టీడీపీ రాజకీయాల్లో ఉద్ధండ పిండంగా ఉంటూ నాలుగేళ్ల క్రితం మరణించిన ఎంవీవీస్ మూర్తి. మరో తాత కేంద్ర మాజీ అమంత్రి కావూరి సాంబశివరావు. వారి ముద్దుల మనవడే శ్రీ భరత్. ఆయన విశాఖలో గీతం విద్యా సంస్థలకు చైర్మన్ గా ఉన్నారు.
అంతే కాదు ప్రఖ్యాత నటుడు నందమూరి బాలక్రిష్ణకు రెండవ అల్లుడు. ఒక విధంగా అన్ని రకాలైన గ్లామర్ గ్రామర్ నిండుగా శ్రీ భరత్ కి ఉంది. అయితేనేమి ఆయనకు రాజకీయ లక్ష్మ్మి మాత్రం వరించడం లేదు అంటున్నారు. అతి కష్టం మీద ఆయన 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ సీటుని టీడీపీ తరఫున సాధించగలిగారు. అయినా సరే కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
విశాఖ లోక్ సభ పరిధిలో సిటీలో నలుగురు ఎమ్మెల్యేలూ టీడీపీ నుంచి గెలిచారు. కానీ ఎంపీగా భరత్ ఓడిపోయారు అంటే దాని వెనక భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది అని అంతా నాడే చర్చించుకున్నారు. దీని మీద అధినాయకత్వానికి శ్రీ భరత్ ఫిర్యాదు చేసినా ఏ రకమైన చర్యలూ ఈ రోజుకీ తీసుకోలేదు అంటున్నారు. ఇక చూస్తే 2024 ఎన్నికల్లో మరోమారు శ్రీ భరత్ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు.
కానీ ఆయనకు టీడీపీ నుంచి టికెట్ లభించడం చాలా కష్టం అనే అంటున్నారు. గతసారి బాలయ్య వత్తిడితో పాటు ఇతరత్రా అనేక కారణాల వల్ల టికెట్ ఇచ్చారు. ఇక పార్టీలోని కొందరు పెద్దల డైరెక్షన్ తోనే ఓడించేశారు అని కూడా ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. అంటే శ్రీ భరత్ రాజకీయాన్ని కొనసాగించకూడదు అన్న పట్టుదల పార్టీలోనే ఉంది అన్న టాక్ నడుస్తోంది.
ఈ నేపధ్యంలో 2024 ఎన్నికల్లో ఆయనకు లోక్ సభ టికెట్ ఇవ్వడం అంటే కష్టమే అని అంటున్నారు. పైగా టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది అని ఆ పొత్తులో ఆ సీటు జనసేనకు ఇస్తారని అంటున్నారు. బీజేపీ కూడా వచ్చి చేరితే కచ్చితంగా విశాఖ ఎంపీ సీటు ఆ పార్టీకి ఇస్తారు అని అంటున్నారు. ఇక టీడీపీలో కూడా ఒక బీసీ నేతకు ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారంలో ఉంది. ఇలా ఏది చూసుకున్నా శ్రీ భరత్ కి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అవకాశం అయితే లేవు అనే అంటున్నారు.
ఈ నేపధ్యంలో మరి శ్రీ భరత్ సంగతేంటి అన్న చర్చ వస్తోంది. అయితే భీమిలీ ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. కానీ అక్కడ లోకల్ కార్డుతో తమ్ముళ్ళు ముందుగానే జాగ్రత్త పడిపోతున్నారు. తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. అంతే కాదు పొత్తు ఉంటే కనుక జనసేన కచ్చితంగా ఈ సీటుని కోరుతుంది అని మరో టాక్ నడుస్తోంది. ఇక విశాఖలో చూస్తే నార్త్ సీటు ఉంది. ఇది కూడా జనసేన పొత్తులో కోరే సీటు. ఇంతకు మించి సీట్లు లేవు. ఇక్కడ మరో చిక్కు కూడా శ్రీ భరత్ కి ఉంది అంటున్నారు.
అదేంటి అంటే విశాఖ తూర్పు నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు ఉన్నారు. ఆయన కూడా నాన్ లోకల్. అయినా దశాబ్దాలుగా సెటిల్ అయిపోయి విశాఖ తూర్పు నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు కచ్చితంగా టికెట్ ఇస్తారు. మరి అదే విశాఖ జిల్లా నుంచి రెండవ సీటు కమ్మ వారికే ఇస్తారంటే బీసీలు, కాపులు ఇతర కులాలు ఉన్న చోట తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని అంటున్నారు.
పైగా కమ్మల జనాభా కూడా ఎక్కడా పెద్దగా లేని చోట వారికి టికెట్ ఇవ్వడం, ఇక బంధువులకే టికెట్ అని ప్రచారం కూడా మొదలైతే కచ్చితంగా పార్టీ ఇబ్బందులో పడుతుంది అంటున్నారు. సో ఎలా చూసుకున్నా శ్రీ భరత్ కి ఈసారి ఎంపీ సీటు దక్కదు, ఎమ్మెల్యే చిక్కదు అన్నట్లుగానే పాలిటిక్స్ ఉంది అంటున్నారు. గతసారి హెల్ప్ చేసిన మామ గారు బాలయ్య కూడా ఈసారి జోక్యం చేసుకోకపోవచ్చు,చేసుకున్నా సర్వేల ప్రకారం సీట్లు ఇచ్చే చంద్రబాబు పట్టించుకోకపోవచ్చు అని అంటున్నారు. తోడల్లుడికి సీటేదీ అంటే జవాబు ఎవరు చెబుతారో మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.