ఎవరినో భయపెట్టాలనో.. ఆందోళనకు గురి చేయాలనో ఇది రాయటం లేదు. ఆ మాటకు వస్తే.. అలాంటి ఆలోచనలు అస్సలు లేవు. వాస్తవాన్ని వాస్తవంగా చూస్తున్నప్పుడు రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. అలాంటి ఆలోచనల్ని పంచుకోవటం ద్వారా.. చుట్టూ ఉన్న వారికి.. ప్రభుత్వానికి అంతో ఇంతో మేలు చేయాలన్న ఉద్దేశమే ఉంది. ప్రధానమంత్రి నిర్వహించిన ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో.. సీసీఎంబీ గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావించి.. ఆ సంస్థను ఎలా వినియోగించుకోవచ్చన్న సలహా చెప్పినంతనే.. ప్రధాని మోడీ ఓకే చెప్పటమే కాదు.. సోమవారం నుంచి ఆ సంస్థ కరోనా నిర్దారణ పరీక్షల్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న వైనాన్ని మర్చిపోకూడదు.
ఇదే రీతిలో.. ఇప్పుడు చెప్పే అంశం కూడా ప్రభుత్వానికి కొత్త ఆలోచనలు ఇచ్చేందుకే. ప్రధాని మోడీ ఇచ్చిన జనతా ఎమర్జెన్సీ దేశ వ్యాప్తంగా విజయవంతంగా సాగుతోంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఇలాంటివేళ.. కరోనా రాకాసిని ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు ఏమేం చేస్తే బాగుంటుందన్న విషయాన్ని చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరికి వారుగా షట్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది.
ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ.. అవసరమైనప్పుడు ఆ ఆలోచన చేస్తామని చెప్పటం కనిపిస్తుంది. కాకుంటే.. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న నానుడిని కేసీఆర్ మర్చిపోకూడదు. కరోనా లాంటి ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు.. ఫలానా టైం లిమిట్ పెట్టుకోవటం తప్పే అవుతుంది. ప్రజలు ఇబ్బంది పడతారని.. భయాందోళనలకు గురి అవుతారన్న ఆలోచనతో తాత్సార్యం చేసే కన్నా.. కఠిన నిబంధనల్ని అమల్లోకి తీసుకురావటం ద్వారా.. కరోనా ముప్పును రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దూరం చేయొచ్చన్నది మర్చిపోకూడదు.
తెలంగాణలో మార్చి మొదటి వారం వరకూ ఉన్న కరోనా పాజిటివ్ కేసులకు.. గడిచిన మూడు రోజుల్లో పెరిగిన తీరు చూసినప్పుడు.. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువే కానీ తక్కువ కాదు. దేశం మొత్తంగా చూస్తే.. వందలోపు పాజిటివ్ కేసులు నమోదు కావటానికి పట్టిన సమయంలో కంటే.. వంద నుంచి 200 కేసులు నమోదు కావటానికి పట్టిన సమయం చాలా తక్కువ. అదే సమయంలో 200 పాజిటివ్ కేసుల నుంచి 300 పాజిటివ్ కేసులు నమోదు కావటానికి పట్టిన సమయం ఇంకాస్త తక్కువన్నది మర్చిపోకూడదు.
కరోనా వైరస్ ఒకసారి తన తఢాఖా చూపించటం మొదలు పెట్టిన తర్వాత దాన్ని అడ్డుకోవటం అంతకంతకూ కష్టమవుతుందన్నది తెలిసిన విషయమే. వూహాన్ మహానగరాన్ని ఎన్ని రోజులు షట్ డౌన్ చేస్తే కానీ.. కరోనా గొలుసును తెగ కొట్టగలిగారన్నది మన కళ్ల ముందు కనిపించేదే. అలాంటప్పుడు..తెలంగాణలోనూ.. ఇటు ఏపీలోనూ కరోనా గొలుసును బ్రేక్ చేయాలంటే ఎంత ముందుగా షట్ డౌన్ నిర్ణయాన్ని అమలు చేస్తే.. అంత మంచిదని చెప్పక తప్పదు. షట్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులకు గురి కావొచ్చు. కానీ.. కరోనా పిశాచి వికట్టహాసం చేయకముందే.. దాన్ని పీచమణిచేందుకు షట్ డౌన్ మినహా మరేమీ లేవన్నది మర్చిపోకూడదు.