ఉగ్రవాదుల్ని ధైర్యంగా ఎదుర్కొనే క్రమంలో నాలుగు బుల్లెట్టు గాయాలు తిని.. మంగళవారం మధ్యాహ్నం మరణించిన ఎస్‌ఐ సిద్ధయ్య సంగతి తెలిసిందే. ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఆయన ప్రదర్శించిన సాహసం మర్చిపోలేనిది.
బుల్లెట్టు గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కామినేని ఆసుపత్రికి చేరటం.. ఆయన్ను చూసేందుకు వచ్చిన గర్భిణి అయిన సిద్ధయ్య సతీమణి అక్కడే బిడ్డకు జన్మనివ్వటం తెలిసిందే. తన ప్రతిరూపమైన కొడుకును చూడకుండానే సిద్ధయ్య కన్నుమూశారు. అదే సమయంలో పుట్టిన మగబిడ్డ అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన వైద్య సేవ కోసం రెయిన్‌బోకి తరలించారు.
ఆ శిశువు ఆరోగ్యపరిస్థితి బాగోలేదన్న నేపథ్యంలో రెయిన్‌బో ఆసుపత్రి వర్గాలు ఆపరేషన్ నిర్వహించాయి. కొద్దిసేపటి క్రితం ముగిసినా ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని.. పిల్లాడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. తిరిగి రాని లోకాలకు సిద్ధయ్య వెళ్లిపోయినా.. ఆయన ప్రతిరూపం మాత్రం బతికింది.